Wednesday, August 18, 2010

ఆడాళ్ళు మీకు జోహార్లు--1981




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::P.సుశీల 

పల్లవి::

సగం కాలిపోయాను..సగం కాలనున్నాను
ప్రేమలో నా సగము
ఈ జ్వాలలో నీ సగము..కాలనీ
పాడుతూ కాలనీ..ఆ పై మంటలే పాడనీ

సగం కాలిపోయాను..సగం కాలనున్నాను
ప్రేమలో నా సగము
ఈ జ్వాలలో నీ సగము..కాలనీ
పాడుతూ కాలనీ..ఆ పై మంటలే పాడనీ

చరణం::1

నీ కోసం నిను వలచి..విలపించే వేదన కోసం
వెయ్యిసార్లు పుడతాను..పదివేలసార్లు మరణిస్తాను
నెరవేరిన అనురాగం..చల్లారిన నిప్పువంటిది
మన తరువాత అది మండుతు వుంటే
అంతకన్నా ఇంకేముంది

కాలనీ..పాడుతూ కాలనీ..ఆ పై మంటలే పాడనీ

చరణం::2

ప్రతి దేహం ఒకనాడు కాలేదే చితిమంటలలో
బ్రతికుండగనే జరిగేదే వింతైనది మన బ్రతుకులలో
మనసులు కలవని యిద్దరిని..మంట ఒకటిగా చేస్తుంది
మనసులు కలవని యిద్దరిని..మంట ఒకటిగా చేస్తుంది
అగ్నిసాక్షిగా పెళ్ళంటే యింతకన్న యింకేముంది
కాలనీ..పాడుతూ కాలనీ..ఆపై మంటలే పాడనీ

సగం కాలిపోయాను..సగం కాలనున్నాను
ప్రేమలో నా సగము
ఈ జ్వాలలో నీ సగము..కాలనీ
పాడుతూ కాలనీ..ఆ పై మంటలే పాడనీ

No comments: