Tuesday, January 26, 2010

మంచిమనుషులు--1974





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::బాలు,జానకి


నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది
పూవుల్లో నువ్వు నేనే మురిసివిరిసేది
తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది
పూవుల్లో నువ్వు నేనే మురిసివిరిసేది
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేది
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేది
తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేది..తీపిని ఇచ్చేది

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడది
నువ్వు లేక వానమబ్బుకు మెరుపే ఎక్కడది
సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము
జీవితాన నువ్వూ నేనై కలిశామిద్దరము

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావు నాకు నిండుగా
కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావు నాకు నిండుగా
ఎన్ని జన్మలైనా ఉందాము తోడునీడగా
ఎన్ని జన్మలైనా ఉందాము తోడునీడగా
నిన్న నేడు రేపే లేని ప్రేమజంటగా..ప్రేమజంటగా

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో
ఈ జగమే లేదు

No comments: