Tuesday, January 26, 2010

మంచిమనుషులు--1974





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం::SP.బాలు,S.జానకి


పడకు పడకు వెంట పడకు
పడుచుపిల్లకు ఆశపడకు
పోపోరా...చినవాడా...2

పడకు పడకు అడ్డుపడకు
పడుచువాణ్ణి చేయి విడకు
పోలేనే...చినదానా...2

లైలా...ఆ...మజునూ...
మేలిముసుగులో పైడిబొమ్మలా
మిసమిసలాడే లైలా
నీ సొగసుకు సలాము చేస్తున్నా
నీ సొగసుకు సలాము చేస్తున్నా

సొగసును మించిన మగసిరితో
నా మనసునుదోచిన మజునూ..
నీ మమతకు గులామునౌతున్నా
నీ మమతకు గులామునౌతున్నా

పెళ్ళికూతురై..వెలుతున్నావా..
మన ప్రేమను ఎడారి చేసావా
మన ప్రేమను ఎడారి చేసావా
పెళ్ళి తనువుకే..చేసారూ...
మన ప్రేమ మనసుకే వదిలాను
మన ప్రేమ మనసుకే వదిలాను
లైలా.....ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

పడకు పడకు వెంట పడకు
పడుచుపిల్లకు ఆశపడకు
పోపోరా...చినవాడా...

హే..ఏ..ఏ..
పడకు పడకు అడ్డుపడకు
పడుచువాణ్ణి చేయి విడకు
పోలేనే...చినదానా...

అనార్...సలీం...
గులాబి పూలతోటలో..ఓ..
హవాయి తీపి పాటలో..
గులాబి పూలతోటలో..
హవాయి తీపి పాటలో..
సలీము లేక గుండెకు
షరాబు మత్తు చూపినా..
ఆ..ఆ..ఆ..అనార్కలీవి నీవు
అనార్కలీవి..నీవు...

ఆఆఆ..మొగల్ సింహాస నానికి.
ఆఆఅ..కసాయి సాసనానికీ
మొగల్ సింహాస నానికి
కసాయి సాసనానికీ
సవాలుగా..జవాబుగా..
గరీబునే వరించినా..ఆ..ఆ
జహాపనావు నువ్వు..జహాపనావు నువ్వు

సలీం..సలీం..సలీం
అనార్....పవిత్ర ప్రేమకు..
సమాధి లేదులే..చరిత్ర మొత్తమే..
విషాధ గాధలే..విషాధ గాధలే

పడకు పడకు వెంట పడకు
పడుచుపిల్లకు ఆశపడకు
పోపోరా...చినవాడా...

హే..ఏ..ఏ..
పడకు పడకు అడ్డుపడకు
పడుచువాణ్ణి చేయి విడకు
పోలేనే...చినదానా...
పోపోరా...చినవాడా...
హే..ఏ..ఏ..
పోలేనే...చినదానా...
పోపోరా...చినవాడా...

No comments: