Tuesday, January 26, 2010

మంచిమనుషులు--1974





సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు


నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొన్నా..2
ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నువ్వు విడిచి వెళ్ళినా
నీ రూపు చెరిగిపోలేదూ
నువ్ మరలి రాకున్నా
నీ చోటెవ్వరికీ వెళ్ళలేదూ..2
తలుపు తెరిచి వుంచుకొనీ
తలవాకిట నించొన్నా..
వలపు నెమరు వేసుకొంటూ
నీ తలపులలో బ్రతికున్నా..

నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొన్నా

ఎందుకిలా చేసావో....
నీకైనా తెలుసా..?
నేనెందుకింక ఉన్నానో..
నాకేమో తెలియదూ..2
నేను చచ్చిపోయినా..
నా ఆశ చచ్చిపోదులే..
నిన్ను చేరువరకూ..నా
కళ్ళు మూత పడవులే...

నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొన్నా

ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

గుండెలోన చేసావూ..
ఆరిపోని గాయాన్నీ..
మందుగా ఇచ్చావూ..
మన వలపు పంట పసివాణ్ణీ..2
ఆ లేతమనసు తల్లికోసం
తల్లడిల్లుతున్నదీ..
నీ తల్లిమనసు తెలియకనే..
దగ్గరౌతు వున్నదీ

నిన్నుమరచిపోవాలనీ
అన్నివిడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకొన్నా..
మనసురాక మానుకొన్నా
మనసురాక మానుకొ
న్నా

No comments: