సంగీతం::G.K.వేంకటేష్
రచన::దాశరథి
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::B.S.Narayana
రాసాను ప్రేమలేఖలెన్నో..దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె..దివిలోన తారకలాయె..నీ నవ్వులే
రాసాను ప్రేమలేఖలెన్నో..దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె..దివిలోన తారకలాయె..నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
రాసాను ప్రేమలేఖలెన్నో..దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో
ఊహూ ..
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో
ఆ....ఆ
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే
అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణని నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో
లా లా ల లాల లాల...లా లా ల లాల లాల...లా లా ల లా
No comments:
Post a Comment