Friday, May 01, 2009

మహారాజు ~~1985




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల


కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేన గంగమ్మతల్లి
మనసున్న మంచోళ్ళే మారాజులు
మమతంటు లేనోళ్ళే నిరుపేదలు
ప్రేమే నీరూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమి అనుకుంటే నీకేమిలే
రాజువయ్య మహరాజువయ్య
రాజువయ్య మహరాజువయ్య

కన్నీట తడిసినా కాలాలు మారవు
మనసార నవ్వుకో పసిపాపల్లే
ప్రేమకన్నా నిధులులేవు
నీకన్న ఎవరయ్యా మారాజులు
నిన్నెవరు ఏమన్నా నీ దాసులు
జరిగినవి జరిగేవి కలలే అనుకో
జరిగినవి జరిగేవి కలలే అనుకో
రాజువయ్య మహరాజువయ్య
రాజువయ్య మహరాజువయ్య

త్యాగాల జీవితం తనవారికంకితం
మిగిలింది నీ నేను నా నువ్వేలే
దేవుడంటి భర్త వుంటే
నాకన్న ఎవరయ్య మారాణులు
మనసున్న బంధాలే మాగాణులు
ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు

రాజువయ్య మహరాజువయ్య
రాజువయ్య మహరాజువయ్య
కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేన గంగమ్మతల్లి
మనసున్న మంచోళ్ళే మారాజులు
మమతనుటు లేనోళ్ళే నిరుపేదలు
ప్రేమే నీరూపం త్యాగం నీ ధర్మం
ఎవరేమి అనుకుంటే నీకేమిలే
రాజువయ్య మహరాజువయ్య
రాజువయ్య మహరాజువయ్య

No comments: