చిమ్మటలోని పాట ఇక్కడ వినండి
సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
::::
చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆఆ
చెలికానిపై అలకెందుకే నీ జతగానితో..తగవెందుకే
చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా..ఆఆఆఆ
వలపేగాని నీపై అలకలేదింకా..ఆ ఆ ఆ
అనురాగమే గెలిచిందిలే..నీ మనసేమిటో..తెలిసిందిలే
గననానమేఘంతొలిగిందిలే..రవిమోమునేడువెలిగిందిలే
గననానమేఘంతొలిగిందిలే..రవిమోమునేడువెలిగిందిలే
అనుమానాలు తీరాలి అభిమానాలు పెరిగాయి
అనురాగమే గెలిచిదిలె నీ మనసేంటో.తెలిసిందిలే
చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆ
చెలికానిపై అలకెందుకే
నా ప్రేమగీతం నీవేలే..ఆ పాట భావం నీవేలే
నా ప్రేమగీతం నీవేలే..ఆ పాట భావం నీవేలే
కమ్మని రాగం నీవైతే..కలసిన తాళం నీవైతే
ఆ గానమే మన ప్రాణమూ..నీ మీదనే నా ధ్యానమూ
చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆ
చెలికానిపై అలకెందుకే
నీ బుగ్గమీద నే చుక్కనై..పాదాలపైన పారాణినై
నీ బుగ్గమీద నే చుక్కనై..పాదాలపైన పారాణినై
పచ్చని పెళ్ళి పందిరిలో..ముచటగొలిపె సుందరినీ
ఈ నాటితో నవజీవనం..మనజీవితం బౄందావనం
చెక్కిలిమీద కెంపులు మెరిసె చిలకమ్మా
చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా..ఆఆ
అనురాగమే గెలిచిందిలే..నీ మనసేమిటో..తెలిసిందిలే
No comments:
Post a Comment