Monday, March 09, 2009

బంగారు కలలు--1974

















సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల

పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

కళకళలాడే నీ కళ్ళు దేవుని ఇల్లమ్మా
కిలకిల నవ్వే నీ మోమే ముద్దుల మూటమ్మా
కళకళలాడే నీ కళ్ళు దేవుని ఇల్లమ్మా
కిలకిల నవ్వే నీ మోమే ముద్దుల మూటమ్మా
నీ కోసమే నే జీవించాలి
నీవె పెరిగి నా ఆశెలు తీర్చాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

ఆటలలో చదువులలో మేటిగా రావాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
ఆటలలో చదువులలో మేటిగా రావాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
చీకటి హ్రుదయంలొ వెన్నెల కాయాలి
నా బంగారు కలలే నిజమై నిలవాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాధుడు కావాలి
నీ సంసారం పూల నావలా సాగిపోవాలి
నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
నిన్నే తలచి నే పొంగిపోవాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి
నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి
పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి

No comments: