Tuesday, December 30, 2008

మల్లెపువ్వు--1978



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిగానం::S.P.బాలు

ఎవరికి తెలుసు చితికిన మనసు
చితిగా రగులుననీ...
ఎవరికి తెలుసు...

ఎవరికి తెలుసు చితికిన మనసు
చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే
నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసు...

మనసుకు మనసే కరువైతే
మనిషికి బ్రతుకే బరువనీ
మనసుకు మనసే కరువైతే
మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట
తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదని
ఈ జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదనీ
ఆ..ఆ..ఆ..ఆ..

ఎవరికి తెలుసూ..
ఎవరికి తెలుసు.. చితికిన మనసు
చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే
నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ

గుండెలు పగిలే ఆవేదనలో
శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో
శృతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదని
నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదనీ

ఆ..ఆ..ఆ..ఆ..
ఎవరికి తెలుసూ
ఎవరికి తెలుసు చితికిన మనసు
చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే
నాలో పలికే కవితలని
ఎవరికి తెలు
సూ

2 comments:

bhanu said...

శక్తి గారు,
ఈ పాట అధ్బుతం. ఈ చిత్రం మాత్రక హిందిలోని "ప్యాసా ( 1957 )". అందులోని పాటలు కూడా మహాధ్బుతం. మీకు వీలు అయినప్పుడు వినండి.

bhanu said...

శక్తి గారు,
మీ పేజి నుంచి పాట సాహిత్యముని కాపీ చేసుకోలేకపోతున్నాను.
ఆ సెట్టింగులను చూడవలసిందిగా కోరుతున్నాను.