Tuesday, December 30, 2008

మల్లెపువ్వు--1978




సంగీతం::చక్రవర్తిరచన::వేటూరి
గానం::వాణీజయరాం


నువు వస్తావనీ బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..
నువు వస్తావనీ బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..
వేణువు విందామని...నీతో ఉందామని...నీ రాధా వేచేనయ్యా రావయ్యా

ఓ ఓ ఓ...గిరిధర...మురహర...రాధా మనోహరా...
నువు వస్తావనీ బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా...రావయ్యా...


నీవూ వచ్చే చోటా....నీవూ నడిచే బాటా
మమతల దీపాలూ వెలిగించానూ...

మమతల దీపాలూ వెలిగించానూ.. ..
కుశలము అడగాలని...పదములు కడగాలని...కన్నీటి కెరటాలు తరలించానూ
ఆ ఆ ఆ...గిరిధర...మురహర...నా హృదయేశ్వరా..ఆ ఆ..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా..

కృష్ణయ్యా...ఓ కృష్ణయ్యా....
కృష్ణయ్యా...ఓ కృష్ణయ్యా

గోవింద గోవింద గోవింద గోవింద....గోపాలా
గోవింద గోవింద గోవింద గోవింద....గోపాలా
గోవింద గోవింద గోవింద గోవింద....


నీ పదరేణువునయ్యా....పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమనీ భావించానూ....బ్రతుకే ధన్యమనీ భావించానూ
నిన్నే చేరాలని....నీలో కరగాలని....నా మనసే హారతిగా వెలిగించానూ
గోవింద గోవింద గోవింద గోవింద....గోపాలా
గోవింద గోవింద గోవింద గోవింద....గోపాలా
గోవింద గోవింద గోవింద గోవింద....గోపాలా

No comments: