చెయ్‌జారిన మణిపూస చెలియ నీవు
తిరిగి కంటికి కనబడితివిగాని
చూపు చూపు శోకలన్ని రేపుతున్నావు
ఎంతటి శాపమిది
రచన::వేటూరి
గానం::S.P.బాలు
ఓ ప్రియా...ఓ ప్రియా
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ
సఖియా..ఆ..ఆ..
నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం
ఓ ప్రియా....మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే
ఓ ప్రియా....మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినదీ
No comments:
Post a Comment