Tuesday, December 30, 2008

మల్లెపువ్వు--1978




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిగానం::S.P.బాలు,P.సుశీల

ఓహో...ఓహో...లలితా...
నా ప్రేమ కవితా..నా ప్రేమ కవితా...
గగనవీణ సరిగమలు పాడగా..ఆ..ఆ..ఆ..
నీ జఘనసీమ స్వరజతలనాడగా..ఆ..ఆ..ఆ..
ఫెళఫెళలతో తరుణ కిరణ సంచలిత లలిత
శృంగార తటిల్లగ కదలగా...కనులు చెదరగా
కదలిరా...కవితలా...వలపుకే వరదలా..
ఓహో...ఓహో...లలితా...నా ప్రేమ కవితా


మల్లెపువ్వులో మధువు పొంగులా వెల్లువైన కవితా
నీ కన్నెవయసు నా ఇంద్రధనుసుగా కదలిరావె నా లలితా
గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా
కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా

నీ అందాలే మకరందాలై...
మల్లె సుగంధం నాలో విరిసే...
సిగ మల్లె పిలుపులే అందుకో...
సిరి మల్లె తీగవై అల్లుకో...
ఈ మల్లెపూవే నీ సొంతమూ...
కదలిరా...కవితలా...వలపుకే వరదలా
ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా

వయసుతోటలో మనసుపాటలా వెల్లివిరిసెలే నీ కథా
నా అణువు అణువు నీ వలపు వేణువై ఝల్లుమన్నదీ నా ఎదా
తెలుగుపాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా
పూలఋతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా

నీ ఊహలలో నే ఊర్వశినై...
నీ కౌగిలికే నే జాబిలినై...
నీ కాలిమువ్వ నా కవితగా...
నా దారి దీయనీ మమతగా...
ఈ మల్లెపూలే నా లలితగా...
కదలిరా..కవితలా..వలపుకే వరదలా...
ఓహో...ఓహో...లలితా...నా ప్రేమ కవితా.
.

No comments: