Saturday, August 18, 2007

సాగరసంగమం::1983::రాగమాలిక



సంగీతం::ఇళయ రాజ
రచన::?
గానం::SP.బాలు,SP.శైలజ

 Cast::Kamal Hassan, Jayapradha, Sarath Babu, S.P.Shailaja, Sakshi Ranga Rao, Geetha, Manju Bhargavi
::::::::::::::::::::::::::::::::::::::::::::::::;

రాగం::భాగేశ్వరి

!!వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!


నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో ఆ.. గమకములో ఆ...
భావములో భంగిమలో గానములో గమకములోఆంగికమౌ తపమీ గతి సేయగ
!! నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ......... !!

రాగం:: బసంత్

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం

రాగం:: లలిత్

భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరననధిర ధిర ధిర ధిర ధిర ధిర..

!! నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ ఆ..ఆ..ఆ
!!

No comments: