Sunday, September 23, 2007

గులేబకావళి కథ --1962




సంగీతం::జోసప్,కృష్ణమూర్తి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,జానకి


కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై..
ఎగసి పోదునో చెలియా..నీవే ఇక నేనై..కలల అలల పై

జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేవెందుకు
తడిసి తడియని కొంగున..మ్మ్..ఒడలు దాచుకున్నందుకు
తడిసి తడియని కొంగున..ఒడలు దాచుకున్నందుకు

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము..ఆ..మరులు గొలుపు తున్నందుకు..ఆ..
విరిసీ విరియని పరువము..మరులు గొలుపు తున్నందుకు..కలల అలల పై

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికానిని..మ్మ్..జంట గూడి రమ్మన్నది..మ్మ్..
జవరాలిని చెలికానిని..జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము..ఓ..బిగి కౌగిట కలదన్నది..ఆ..
అగుపించని ఆనందము..బిగి కౌగిట కలదన్నది
కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై...
ఎగసి పోదునో చెలియా..నీవే ఇక నేనై..కలల అలల పై..

No comments: