Sunday, September 23, 2007

జగదేకవీరుని కథ--1961:::దేశ్ :: రాగం







సంగీతం::పెండ్యాల
రచన::పింగళి
గానం::ఘంటసాల

దేశ్ :: రాగం 

సాకీ::


ఓ….దివ్య రమణులారా,నేటికి కనికరించినారా
కలకాదుకదా! సఖులారా! ఆ..ఆ..ఆ..ఆ..

పల్లవి::

ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ..ఓ సఖీ!

చరణం::1

కలలోపల కనిపించి వలపించిన చెలులోహో..ఓ..ఓ..
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో
కనులవిందు చేశారే...ఏ….ఏ..
కనులవిందు చేశారిక ధన్యుడనైతిని నేనహ
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ..ఓ సఖీ!


చరణం::2

నయగారము లొలికించి..ప్రియరాగము పలికించి
నయగారము లొలికించి,ప్రియరాగము పలికించి
హాయినొసగు ప్రియలేలే...ఏ...ఏ…
హాయినొసగు ప్రియలే మరి మాయలు,సిగ్గులు ఏలనె
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయమోహినీ..ఓ సఖీ!

చరణం::

కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు
ఆటలహో తెలిసెనులే...ఏ...ఏ..
ఆటలహో తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె
ఓ సఖీ! ఒహో చెలీ! ఒహో మదీయ మో..హినీ

No comments: