Sunday, September 23, 2007

జగదేకవీరుని కథ--1961::రాగం::కీరవాణి

సంగీతం::పెండ్యాల నాగేశ్వర రావ్
రచన::పింగళి నాగేంద్ర రావ్
గానం::P.సుశీల,P.లీల


రాగం:::కీరవాణి:::

జలకాలాటలలో కలకలపాటలలో
ఏమి హాయిలే హల
అహ ఏమి హాయిలే హల
జలకాలాటలలో కలకలపాటలలో
ఏమి హాయిలే హల
అహ ఏమి హాయిలే హల
లలాలల లలాలలల అహహ హ ఉహు ఉహు

ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
ఒహొహొహొహొ హొహొహొ .....
ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసేనే
అహ వన్నెచిన్నెల కన్నెమనసులో సన్నవలపువిరిసే
అహ వన్నెచిన్నెల కన్నెమనసులో సన్నవలపువిరిసే
జలకాలాటలలో కలకలపాటలలో
ఏమి హాయిలే హల
అహ ఏమి హాయిలే హల

తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
అహహ అహహ అహహ అహహ అ
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే
తరుణకాలమేలే అది వరుని కొరకు పిలుపే
తరుణకాలమేలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే
జలకాలాటలలో కలకలపాటలలో
ఏమి హాయిలే హల
అహ ఏమి హాయిలే హల

No comments: