మూలం::చింతామణి నాటకము
రచన::కాళ్ళకూరి నారాయణ రావు
గానం::ఘంటసాల వెంకటేశ్వర రావు
సంగీతం::అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు
సంగీత పర్యవేక్షణ::పి.భానుమతి
కష్ట భరితంబు బహుళ దుఃఖప్రదంబు
సారరహితంబునైన సంసారమందు
భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసె
పురుషులనిమిత్తము పురాణ పూరుషుండు!!
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
చూడు..
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరక యేడ్పించువారు
పడపుగత్తెల ఇండ్ల బానిసెంచై ధర్మపత్ని యన్నను మండిపడెడివారు
బయట నెల్లరచేత పడివచ్చి యింటను పొలతినూరక తిట్టి పోయువారు
పెట్టుపోతల పట్లగలట్టి లోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు
ఖలులు, కఠినులు, హీనులు, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము
No comments:
Post a Comment