సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం ::ఘంటసాల
అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా
శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు...
కను చూపు కరువైన వారికైనా
కను చూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు...
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలిగించు నగరానికొచ్హాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు...
ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన
ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి
సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారని
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు...
రాజులే పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు పోయినా గాల్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ......
చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు నా హౄదయాన
నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలి నిజమునా జాబిలి
No comments:
Post a Comment