హరికథ !! రాగమాలిక !!
సంగీతం: పెండ్యాల
రచన:పోతన,కరుణశ్రీ,శ్రీశ్రీ
గానం: ఘంటసాల
!! కానడ రాగం !!
శ్రీ నగజా తనయం సహృదయం 2
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కల్యాణ సత్కథ. నలభైరోజుల
నుండి చెప్పిన కథ చెప్పినచోట చెప్పకుండ చెప్పుకొస్తున్నాను. అంచేత
కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా కాస్త పాలు మిరియాలు !
చిత్తం. సిద్ధం.
భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన
వీరాధివీరులలో అందరిని ఆకర్శించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి
ఆహా, అతడెవరయ్యా అంటే -
!! శంకరా భరణ రాగం !!
రఘురాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు 2
వాడు, నెలరేడు, సరిజోడు, మొనగాడ
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా (వాని కనులు)
వాని చూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరోమరుడు, మనోహరుడు (రఘు రాముడు)
ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతహ్పు
గవాక్శం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
!! మోహన రాగం !!
ఎంత సొగసుగాడే 2
మన నింతలోనె దోచినాడే (ఎంత)
మోము కలువ రేడే 2
నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే (ఎంత)
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా,అక్కడ స్వయంవర సభా
మంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి -
!! తోడి రాగం !!
అనియెనిట్లు, ఓ యనఘులార నా యనుగుపుత్రి సీతా
వినయాధిక సద్గుణవ్రాత, ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెలమాలవైచి పెండ్లాడు !
అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే సభలోనివారందరూ
ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట.మహావీరుడైన రావణాసురుడు
కూడ " హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని శాపము ! దీనిని
స్పృచించుటయే మహాపాపము"అని అనుకొనినవాడై వెనుతిరిగిపోయాడట.
తదనంతరంబున -
!! శ్రీ రాగం !!
ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొ క్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదం తలదాల్చి
సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత
మదన విరోధి శరాసనముని తనకరమున బూనిన యంత
!! కేదారగౌళ రాగం !!
పెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె,
గుభిల్లుమనె గుండె నృపులకు,ఝల్లుమనియె
జానకీ దేహముం ఒక్క నిమేశమునందె
నయం జయమును భయము విస్మయముగదుర !
శ్రీమద్రమారమణ గోవిందో హారి
భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగావుంది.మరొక్కసారి జై
శ్రీమద్రమారమణ గోవిందో హారి ! భక్తులారా ! ఆవిధంగా శ్రీరామ
చంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడుట.అంతట
!! కల్యాణి రాగం !!
భూతలనాధుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె పృధుగుణ మణి సంఘాతం భాగ్యోపేతం సీతం
భుతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
శ్రీమద్రమారమణ గోవిందో హారి !!!
No comments:
Post a Comment