సాహిత్యం::ఆరుద్ర
గాత్రం::P.సుశీల
సంగీతం::KV.మహదేవన్
దర్శకత్వం::ఆదుర్తి సుబ్బారావు
తారాగణం::నాగేశ్వరరావు,సావిత్రి,షావుకారు జానకి,ఎస్వి.రంగారావు,సూర్యకాంతం.
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్... హొయ్
పసివాని చూచుటకీ తొందర
మైమరిచి ముద్దాడి లాలింతుర
లులులుల ఆయి లులులుల ఆయి
ఉహు ఉహు ఉహు ఉహు
పసివాని చూచుటకీ తొందర
మైమరిచి ముద్దాడి లాలింతుర
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకు ఏముంది మీదగ్గర
ఏవండోయ్...
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ !!
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
ఒహొహొ ఓ
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా...
!! ఏవండోయ్....
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ !!
ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
అయ్యో పాపం
ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కపటాలు మానేసి నా మదిలోన
కాపురము చేయండి కలకాలము
!! ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ హొయ్ హొయ్ !!
No comments:
Post a Comment