సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల
రాగం:::శంకరాభరణం
జోరుగ హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయ తీయ్యగా
జోరుగ హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయ తీయ్యగా జోరుగ
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే మరువనంటినే ఒ.....
!!జోరుగ జోరుగ!!
నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలిసిరాగదే కలిసిరాగదే ఒ.....
!!జోరుగ జోరుగ!!
నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
వరించినాడనే వరించినాడనే ఒ.....
జోరుగ హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయ తీయ్యగా !!
No comments:
Post a Comment