Thursday, February 08, 2007

భార్యా భర్తలు--1961::రాగం:::సింధుబైరవి



ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::రాజేశ్వర రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల

రాగం:::సింధుబైరవి :::

పల్లవి:

ఓ....సుకుమారా...నిను చేరా
రావోయీ......ఇటు రావోయీ
నిలువగలేని వలపుల రాణి
నీ కొరకే తపించునులే
నీ కొరకే తపించునులే
నిలువగలేని వలపుల రాణి
నీ కొరకే తపించునులే

ఓ...జవరలా ...ప్రియురాలా
ఈనాడే మనదే హాయీ
తనువుగ నేడు ఈ చెలికాడు
నీ దరినే సుఖించునులే

చరణం::1

కోటీ కిరణములా కోరిన గాని
భానుని చూడదు కలువ చెలీ
వెన్నెలకాంతీ వెలిగిన వేళా 2
విరియునుగా విలాసముగా
నిలువగలేని వలపుల రాణి
నీ కొరకే తపించునులే

చరణం:: 2

వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరముగా 2
కలువలరాణీ వలపులలోనే 2
కళ కళలాడి చేరెనుగా
తనువుగ నేడు ఈ చెలికాడు
నీ దరినే సుఖించునులే

No comments: