Thursday, February 08, 2007

భార్యాభర్తలు--1961::సింధుబైరవి::రాగం




సంగీతం::సాలూరి రాజేశ్వరరావు గారు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల
సింధుబైరవి::రాగం


పల్లవి::


ఏమని పాడెదనో ఈవేళ
ఏమని పాడెదనో ఈవేళ
మానసవీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో

చరణం::1

జగమే మరచి హృదయ విపంచి
జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో

చరణం::2

వనసీమలలో హాయిగ ఆడే
వనసీమలలో హాయిగ ఆడే
రా చిలుకా నిను రాణిని చేసే
రా చిలుకా నిను రాణిని చేసే
పసిడి తీగలా పంజర మిదిగో
పలుక వేమని పిలిచే వేళ

ఏమని పాడెదనో ఈవేళ
మానసవీణ మౌనముగా నిదురించిన వేళ
ఏమని పాడెదనో ఓ ఓ ఓ ఓ

No comments: