Thursday, February 08, 2007

భార్యాభర్తలు--1961




సంగీతం::సాలూరి రాజేశ్వరరావు గారు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

పల్లవి::

రంగరంగేళి సుఖాలను తేలి
రంగరంగేళి సుఖాలను తేలి
రావోయి మధురమీ రేయి
రంగరంగేళి

చరణం::1

నిన్ను కోరే గులాబులు
ఇయ్యవేలా జవాబులు
నిన్ను కోరే గులాబులు
ఇయ్యవేలా జవాబులు
మనసులోని మమతలేవో
మనసులోని మమతలేవో
తెలుపునే మెరిసే కనులు

రంగరంగేళి సుఖాలను తేలి
రావోయి మధురమీ రేయి
రంగరంగేళి

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పరాకేలనోయి ప్రియా
భరింపజాల ఈ ఈ ఈ ఈ ఈ విరహ జ్వాల...వహ్వా
వలపుల బాలనని బేలనని రమ్మనవు
వలపుల బాలనని బేలనని రమ్మనవు
వలచి చేరితినే కోరితినే చిరునగవు
తొలగిపోయదవో చాలునులే ఈ బిగువు
తొలగిపోయదవో చాలునులే ఈ బిగువు
సరసాలు మురిపాలు మరి రానేరావు

రంగరంగేళి సుఖాలను తేలి
రావోయి మధురమీ రేయి
రంగరంగేళి

No comments: