సంగీతం::ఇళయరాజా రచన::వేటూరి గానం::S.P.బాలు Film Directed By::Baapu తారాగణం::చిరంజీవి,తులసి,సుధాకర్,పూర్ణిమాజయరాం,అల్లురామలింగయ్య,నిర్మలమ్మ,రావికొండల్రావు. పల్లవి:: మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా జబరుదస్తీ చేస్తే శాస్తిరా విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కావురా దోస్తీ..ఒకటే ఆస్తిరా జబరుదస్తీ చేస్తే శాస్తిరా చరణం::1 కాదురా ఆటబొమ్మ..ఆడదే నీకు అమ్మ ఎత్తరా కొత్త జన్మ..ప్రేమ నీ తాత సొమ్మా తెలుసుకో తెలివిగా మసలుకో ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము అలుసుగా ఆడకు మనసుతో ఆ ప్రేమ ధనికుల విలువలు గని నీ వంటి ధనికులు వెలవెలమని ఆ ప్రేమ ధనికుల విలువలు గని నీ వంటి ధనికులు వెలవెలమని జీవిస్తే ఫలితమేమిటి శ్రీరాగమున కీర్తనలు మానరా దోస్తీ..ఒకటే ఆస్తిరా..జబరుదస్తీ చేస్తే శాస్తిరా చరణం::2 ప్రేమకై నీవు పుట్టు..ప్రేమకై నీవు బ్రతుకు ప్రేమకై నీవు చచ్చి..ప్రేమవై తిరిగి పుట్టు మరణమే లేనిది మనసురా క్షణికమే యవ్వనమ్ము..కల్పనే జీవనమ్ము నమ్ముకో..దిక్కుగా ప్రేమనే ఈ జనన మరణ వలయములనిక ఛేదించి మమతను మతమనుకుని ఈ జనన మరణ వలయములనిక ఛేదించి మమతను మతమనుకుని జీవించే మోక్షమార్గము..శ్రీరస్తననుచు దీవెనగ దొరికిన దోస్తీ ఒకటే ఆస్తిరా..జబరుదస్తీ చేస్తే శాస్తిరా విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కావురా దోస్తీ ఒకటే ఆస్తిరా..జబరుదస్తీ చేస్తే శాస్తిరా
సంగీతం::K.V..మహాదేవన్ రచన::ఆరుద్ర గానం::P.సుశీల,B.వసంత తారాగణం::N.T.రామారావు,అర్జా జనార్ధనరావు,కాంతారావు,B.సరోజాదేవి,జయంతి,రాజశ్రీ. పల్లవి:: శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ చరణం::1 దధిక్షీరమ్ములకన్నా ఎంతో మధుర మధుర నామం సదా శివుడు ఆ రజతాచలమున సదా జపించే నామం కరకుబోయ తిరగేసి పలికినా కవిగా మలచిన నామం రా..మరా..మరామ..రామ రామ..రామ..రామ..రామ కరకుబోయ తిరగేసి పలికినా కవిగా మలచిన నామం రాళ్లు నీళ్లపై చీల్చిన నామం రక్కసి గుండెల శూల..మ్మ్ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ చరణం::2 వేయి జపాల కోటి తపస్సుల విలువ..ఒక్కనామం..మ్మ్ నిండుగ దండిగ వరములొసంగే రెండక్షరముల..నామం ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం చల్లని నామం మ్రోగే చోట చెల్లదు..మాయాజాలం రామ..రామ..రామ..సీతా రామ..రామ..రామ..రామ రామ..రామ..రామ..సీతా రామ..రామ..రామ..రామ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ శ్రీకరమౌ శ్రీరామ నామం జీవామృతసారం..మ్మ్ పావనమీ రఘురామ నామం భవ తారకమంత్రం..మ్మ్ పల్లవి:: శ్రీయుతమౌ శ్రీరామ పాదం శ్రీతజన మందారం పావనమీ రఘురామ పాదం పాపవినాశకరం కలుషమ్ముల ప్రక్షాళన చేసే గంగ చలించిన పాదం అసురమదమ్మును పాతాళానికి అణచివేసిన పాదం రాతిని నాతిని చేసిన పాదం అడవికి అందం పోసిన పాదం నీ చరణమ్మే శరణమ్మనగా ఇచ్చును పెన్నిధానం॥ చరణం::1 అవలీలగ జలధిని దాటిన మేటి పవనకుమారుడు పట్టే పాదం బ్రహ్మేంద్రాదులు కొలిచే పాదం పరబ్రహ్మ పదానికి మూలం తాను ధరించిన పాదుకలకు దర పట్టము కట్టిన పాదం తమ్ముడు భరతుని తరతరాలకు
సంగీతం:::S.రాజేశ్వరరావు రచన::M.బాలయ్య గానం::L.R.ఈశ్వరి,S.P.బాలు బృందం Film Directed By::K.S.R.Daas తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ యం.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ.