సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు
Film Directed By::Baapu
తారాగణం::చిరంజీవి,తులసి,సుధాకర్,పూర్ణిమాజయరాం,అల్లురామలింగయ్య,నిర్మలమ్మ,రావికొండల్రావు.
పల్లవి::
మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో
చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ..ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా
చరణం::1
కాదురా ఆటబొమ్మ..ఆడదే నీకు అమ్మ
ఎత్తరా కొత్త జన్మ..ప్రేమ నీ తాత సొమ్మా
తెలుసుకో తెలివిగా మసలుకో
ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము
అలుసుగా ఆడకు మనసుతో
ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
జీవిస్తే ఫలితమేమిటి
శ్రీరాగమున కీర్తనలు మానరా
దోస్తీ..ఒకటే ఆస్తిరా..జబరుదస్తీ చేస్తే శాస్తిరా
చరణం::2
ప్రేమకై నీవు పుట్టు..ప్రేమకై నీవు బ్రతుకు
ప్రేమకై నీవు చచ్చి..ప్రేమవై తిరిగి పుట్టు
మరణమే లేనిది మనసురా
క్షణికమే యవ్వనమ్ము..కల్పనే జీవనమ్ము
నమ్ముకో..దిక్కుగా ప్రేమనే
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
జీవించే మోక్షమార్గము..శ్రీరస్తననుచు దీవెనగ దొరికిన
దోస్తీ ఒకటే ఆస్తిరా..జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ ఒకటే ఆస్తిరా..జబరుదస్తీ చేస్తే శాస్తిరా
No comments:
Post a Comment