Monday, December 29, 2014

పల్నాటి సింహం--1985


















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

ఈ కుంకుమతో ఈ గాజులతో..ఓఓ
కడతేరిపోనీ..స్వామీ..ఈ
కనుమూయనీ నన్ను స్వామీ..ఈ
ఓఓఓ..చెన్నకేశవా..పసుపు కుంకుమ
జంట కలిశాయి దీవించరా..జంట కలిశాయి దీవించరా

చరణం::1

పల్నాటి సీమంతా పండు మిరప చేలు
పసుపు కుంకాలిచ్చి సీమంతాలాడేను
మాంచాల మాదేవి మాంగళ్యం మాదేను
పేదైన మగసిరుల పేరంటాలాడేను
పౌరుషమున్న బ్రతుకులలోన పాశం కన్నా దేశం మిన్న
బ్రతికే ఉన్నా చితిలో ఉన్నా అసువులకన్నా పసుపే మిన్న
పచ్చని సీమ పల్నాడంతా వైకుంఠమై వెలిగే వేళ
ఈ కుంకుమతో ఈ గాజులతో..ఓఓ
కడతేరిపోనీ స్వామీ..ఈ

చరణం::2

ఏడడుగులు నడిచాను ఏనాడో మీతోడు
ఏడేడు జన్మలకి అవుతాను మీతోడు
జననాలు మరణాలు కాలేవు ఎడబాటు
నిండు ముత్తైదువుగా ఎదురొచ్చి దీవించు
ఆలిగా నేను అంతిమ జ్వాల హారతి పడితే అంతే చాలు
జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతివి నువ్వు జోతలు నీకు
మళ్ళీ జన్మ మనకే ఉంటే పల్నాటిలోనే పుడుదామంట
ఈ కుంకుమతో ఈ గాజులతో..ఓఓ
కడతేరిపోనీ స్వామీ..ఈ 
కనుమూయనీ నన్ను స్వామీ..ఈ 

Wednesday, December 24, 2014

సుప్రభాతం--1976


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P..బాలు,వాణిజయరాం.  
Film Directed By::K.S.PrakaashRao
తారాగణం::కృష్ణంరాజు,వాణిశ్రీ,సత్యనారాయణ,అల్లురామలింగయ్య,జయంతి,రమాప్రభ,రాజబాబు,నిర్మల,రావుగోపాల్రావు,గిరిజ. 

పల్లవి::

ఈ లోకం ఇలా వుంది ఎంచేతా 
నాతో నా గీత వుంది అంచేతా
గోవిందూ చాటుమాటు ఆనందూ 
గోదావరి ఈతా లంక మేతా
ఈ లోకం ఇలా వుంది ఎంచేతా 
నాతో నా గీత వుంది అంచేతా

చరణం::1

అత్తింటి కాపురానా అడుగడుగున బందిఖానా 
అత్తింటి కాపురానా అడుగడుగునా బందిఖానా 
సరసానికి లేదు టికానా 
చూసాను చిట్కా మా అమ్మకు వేసా మస్కా
సరసాలు పదివేలు వెనక్కి తిరక్క చలో చలో
ఈ లోకం ఇలా వుంది ఎంచేతా 
నీతో నీ గీత వుంది అంచేతా అంతే

చరణం::2

పదిమంది తిరిగేచోట పాడాలా డ్యూయెట్ పాట 
పదిమంది తిరిగేచోట పాడాలా డ్యూయెట్ పాట 
ఎవరైనా...చూస్తే గలాటా 
అమ్మ అదా సంగతి తెలిసింది 
జాను కథ లాంచిలో నడిపిస్తాను
సరదాగా పరదాల వెనక్కి వెనక్కి చలో చలో
ఈ లోకం ఇలా వుంది ఎంచేతా 
నీతో నీ గీత వుంది అంచేతా

Suprabhaatam--1976
Music::Pendyaala NageswaraRao
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Balu,Vanijayaram
Film Directed By::K.S.PrakaashRao
Cast::Krishnaraju,Vanisree,Kaikala Satyanaraayana,Alluraamalingayya,Jayanti,
Ramaaprabha,Rajababu.

:::::::::

ii lOkam ilaa vundi enchEtaa 
naatO naa geeta vundi anchEtaa
gOvindoo chaaTumaaTu aanandoo 
gOdaavari iitaa lanka mEtaa
ii lOkam ilaa vundi enchEtaa 
naatO naa geeta vundi anchEtaa

::::1

attinTi kaapuraanaa aDugaDuguna bandikhaanaa 
attinTi kaapuraanaa aDugaDugunaa bandikhaanaa 
sarasaaniki lEdu Tiknaanaa  
choosaanu chiTkaa maa ammaku vEsaa maskaa
sarasaalu padivElu venakki tirakka chalO chalO
ii lOkam ilaa vundi enchEtaa 
neetO nee geeta vundi anchEtaa antE

::::2

padimandi tirigEchOTa paaDaalaa duet paaTa 
padimandi tirigEchOTa paaDaalaa duet paaTa 
evarainaa...choostE galaaTaa 
amma adaa sangati telisindi 
jaanu katha laanchilO naDipistaanu
saradaagaa paradaala venakki venakki chalO chalO
ii lOkam ilaa vundi enchEtaa 
neetO nee geeta vundi anchEtaa

Tuesday, December 23, 2014

పొరుగింటి పుల్లకూర--1976


సంగీతం::చక్రవర్తి
రచన::శ్రీశ్రీ 
గానం::V.రామకృష్ణ,బృందం.  
Film Directed By::V.Madhusoodhan Rao
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

చరణం::1

ఎండమావిలో..నీరు దొరుకునా
గాలిమేడలో..బ్రతుకు సాగునా
ఈవలి గట్టున..మేసే ఆవుకు
ఆవలి గట్టే..ఎంతో పచ్చన
తీరిందా...నీ భ్రమ ఇది
ఫలితం...లేని శ్రమ        
ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

చరణం::2

దూరపు కొండలు..నునుపని తలచి
దగ్గర వారికి..దూరమైతివి
కోరిన సిరులే..ఉరులై పోయెను
చివరకి మిగిలెను..పరితాపం
స్వయంకృతం..నీ అపరాధం
స్వయంకృతం..నీ అపరాధం  
ఉన్నదానితో...పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

Poruginti Pullakoora--1976
Music::Chakravarti
Lyrics::Sree Sree
Singer's::V.Ramakrishna,Brundam
Film Directed By::V.Madhusoodhan Rao
Cast::Ramakrishna,Kanchana.Muralimohan,Jayachitra,Rajababu,Mamata,Nirmala,Kakaraala.

:::::::::

unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edii aaSaku...haddu

::::1

enDamaavilO..neeru dorukunaa
gaalimEDalO..bratuku saagunaa
eevali gaTTuna..mEsE aavuku
aavali gaTTE..entO pachchana
teerindaa...nee bhrama idi
phalitam...lEni Srama        
unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edee aaSaku...haddu

::::2

doorapu konDalu..nunupani talachi
daggara vaariki..dooramaitivi
kOrina sirulE..urulai pOyenu
chivaraki migilenu..paritaapam
swayamkRtam..nee aparaadham
swayamkRtam..nee aparaadham  
unnadaanitO...pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edee aaSaku...haddu

పొరుగింటి పుల్లకూర--1976



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల
Film Directed By::V.Madhusoodhan Rao
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి
చెలరేగెను తీయని..పులకింత
వెన్నెలకూడా...వేడివేడిగా
వెన్నెలకూడా...వేడివేడిగా
ఆరడిపెట్టి...గారడిచేస్తే 
ఏమైపోనమ్మా..నేనేమైపోనమ్మా
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి

చరణం::1

వెళ్ళొస్తానన్నది..కన్నెతనం
వచ్చేశానన్నది..కలికితనం
వెళ్ళొస్తానన్నది..కన్నెతనం
వచ్చేశానన్నది..కలికితనం 
వెళ్ళు మరీ..ఊ వెళ్ళుమరి
అన్నదమ్మా..పడుచుతనం
వెళ్ళలేక...ఉండలేక
వెళ్ళలేక...ఉండలేక
ఉన్నచోట..నిలువలేక
తుళ్ళి తుళ్ళి..పడిందీ ఆడతనం 
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి

చరణం::2

వయసొచ్చిన పిల్లకీ..వలపే అందం
వలపు కానుకే...బంధం
మనసిచ్చిన వేళ మాటే మంత్రం
అదే..మంగళ సూత్రం
కలలుగనీ...మనసుపడీ
కలలుగనీ...మనసుపడీ 
కౌగిలిలో....కరగాలని
ఎదురు చూచీ..నిదురకాచీ
ఎదురు చూచీ..నిదురకాచీ 
ఆ రూపే మది..నిలిపిన
కన్నె మనసే..కళ్యాణ మంటపం  
    
చుక్కలలో దిక్కులలో..ఈ రేయి
పాడింది మా పెళ్ళి..సన్నాయి
చెలరేగెను తీయని..పులకింత
వెన్నెలకూడా...వేడివేడిగా
వెన్నెలకూడా...వేడివేడిగా
ఆరడిపెట్టి....గారడిచేస్తే 
ఏమైపోనమ్మా..నేనేమైపోనమ్మా

Poruginti Pullakoora--1976
Music::Chakravarti
Lyrics::Veturisundararammoorti
Singer's::P.Suseela
Film Directed By::V.Madhusoodhan Rao
Cast::Ramakrishna,Kanchana.Muralimohan,Jayachitra,Rajababu,Mamata,Nirmala,Kakaraala.

:::::::::

chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi
chelarEgenu teeyani..pulakinta
vennelakooDaa...vEDivEDigaa
vennelakooDaa...vEDivEDigaa
aaraDipeTTi...gaaraDichEstE 
EmaipOnammaa..nEnEmaipOnammaa
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi

::::1

veLLostaanannadi..kannetanam
vachchESaanannadi..kalikitanam
veLLostaanannadi..kannetanam
vachchESaanannadi..kalikitanam 
veLLu marii..uu veLLumari
annadammaa..paDuchutanam
veLLalEka...unDalEka
veLLalEka...unDalEka
unnachOTa..niluvalEka
tuLLi tuLLi..paDindee aaDatanam 
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi

::::2

vayasochchina pillakii..valapE andam
valapu kaanukE...bandham
manasichchina vELa maaTE mantram
adE..mangaLa sootram
kalaluganii...manasupaDii
kalaluganii...manasupaDii 
kaugililO....karagaalanii
eduru choochii..nidurakaachii
eduru choochii..nidurakaachii 
aa roopE madi..nilipina
kanne manasE..kaLyaaNa manTapam 
    
chukkalalO dikkulalO..ii rEyi
paaDindi maa peLLi..sannaayi
chelarEgenu teeyani..pulakinta
vennelakooDaa...vEDivEDigaa
vennelakooDaa...vEDivEDigaa
aaraDipeTTi....gaaraDichEstE 
EmaipOnammaa..nEnEmaipOnammaa

Monday, December 22, 2014

మా ఊరి దేవత--1979



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు, P.సుశీల
Film Ditected By::Giridhar
తారాగణం::రంగనాథ్,ప్రభ,ప్రభాకర్ రెడ్డి,మోహన్ బాబు,కాంతా రావు,రాజనాల,జయమాలిని

పల్లవి::

కలువ కనులు మూయకు..కలలే అలలై చెలరేగునే
పెదవులు కదిలించకు..వలపే పిలుపై రాగాలు పలికించునే
చిలిపి చూపు చూడకు..తనువు మనసు పులకించులే
వలపు వలలు వేయకు..వగలే సెగలై నాలోన రగిలించులే
మ్మ్..కలువ కనులు మూయకు..కలలే అలలై చెలరేగునే

చరణం::1

ఈ..ఈ..వేడి కౌగిలి..కరిగే..ఏఏఏ..చిరుగాలి
ఏ పూర్వ పుణ్యము..చేసిందో
ఈ..వేడి కౌగిలి..కరిగే..చిరుగాలి
ఏ పూర్వ పుణ్యము..చేసిందో
నా రాజు పాదాల నలిగే పూబాల
ఎన్నెన్ని..నోములు నోచిందో..ఓ 
వరమే కాదా...అనురాగం
కొందరికేలే...ఆ యోగం
కొందరికేలే...ఆ యోగం
కలువ కనులు..మూయకు
కలలే...అలలై చెలరేగునే

చరణం::2

నీ..ఈ..ప్రేమ బంధాల..వెలిగే..ఏఏఏ..అందాలు
నా జీవితాన...నవనందనాలు
నీ..ఈ..ప్రేమ బంధాల..వెలిగే..ఏఏఏ..అందాలు
నా జీవితాన...నవనందనాలు
ఈ వింత గిలిగింత..బ్రతుకంత పులకింత
నా గుండెలో..మ్రోగే మురళీ రవాలు..ఊఊ 
ఈ పాట మన ప్రేమకే ఆనవాలు
ఈ జన్మకిది..చాలు పదివేలు 
ఈ జన్మకిది..చాలు పదివేలు 

కలువ కనులు..మూయకు
కలలే అలలై...చెలరేగునే 
వలపు వలలు..వేయకు
వగలే సెగలై..నాలోన రేగిలించులే..ఏఏఏ

Maa Uri Devata--1979
Music::Chakravarti
Lyrics::Veturisundararammoorti
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::Giridhar
Cast::Ranganath,Prabha,Prabhakar Reddi,Mohanbabu,KantaRao,Rajanala,Jayamalini.

:::::::::

kaluva kanulu mooyaku..kalalE alalai chelarEgunE
pedavulu kadilinchaku..valapE pilupai raagaalu palikinchunE
chilipi choopu chooDaku..tanuvu manasu pulakinchulE
valapu valalu vEyaku..vagalE segalai naalOna ragilinchulE
mm..kaluva kanulu mooyaku..kalalE alalai chelarEgunE

::::1

ii..ii..vEDi kaugili..karigE..EEE..chirugaali
E poorva puNyamu..chEsindO
ii..ii..vEDi kaugili..karigE..EEE..chirugaali
E poorva puNyamu..chEsindO
naa raaju paadaala naligE poobaala
ennenni..nOmulu nOchindO..O 
varamE kaadaa...anuraagam
kondarikElE...aa yOgam
kondarikElE...aa yOgam
kaluva kanulu..mooyaku
kalalE...alalai chelarEgunE

::::2

nee..ii..prema bandhaala..veligE..EEE..andaalu
naa jeevitaana...navanandanaalu
nee..ii..prema bandhaala..veligE..EEE..andaalu
naa jeevitaana...navanandanaalu
ii vinta giliginta..bratukanta pulakinta
naa gunDelO..mrOgE muraLee ravaalu..UU 
ii paaTa mana prEmakE aanavaalu
ii janmakidi..chaalu padivElu 
ii janmakidi..chaalu padivElu 

kaluva kanulu..mooyaku
kalalE alalai...chelarEgunE 
valapu valalu..vEyaku
vagalE segalai..naalOna rEgilinchulE..EEE

Tuesday, December 16, 2014

బంగారు బావ--1980



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,శ్రీదేవి.

పల్లవి::

మల్లికా ఆఆఆఆఆ 
మల్లికా..నవ మల్లికా..ఆ
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..నవ మల్లికా..ఆ
మదనోత్సవ..సంగీత సంచిక
రగిలే వేసవి..రాగమాలికా
మధుర శరదృతు..మౌనగీతికా..ఆ
రగిలే వేసవి..రాగమాలికా
మధుర శరదృతు.మౌనగీతికా
ప్రేమిక మానస..లగ్నపత్రిక
పులకింతల..తొలి చూలు పుత్రికా
మల్లికా..ఆఆఆ 
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..నవ మల్లికా..ఆఆఆ

చరణం::1

యలమావులలో..విరితావులలో
మనసున కోయిలలెగసే..వేళ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
యలమావులలో..విరితావులలో
మనసున కోయిలలెగసే..వేళ 
వయసంతా..వసంత గానమై
వయసంతా..వసంత గానమై 
జనియించిన యువ..కావ్య కన్యక
మరులు గొలుపు..మరుని బాణ దీపిక
మల్లికా..ఆఆఆ
మల్లికా..ఆఆఆ 
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..నవ మల్లికా..ఆఆఆ

చరణం::2

తొలి కోరికలే..అభిసారికలై
వలపుల కౌగిట..బిగిసేవేళా
తొలి కోరికలే..అభిసారికలై
వలపుల కౌగిట..బిగిసేవేళా
ఆ సొగసే..అమృతాభిషేకమై 
ఆ సొగసే..అమృతాభిషేకమై
తనియించిన..భువిలోన తారకా
మనసు..తెలుపు తెలుపు 
నీదే మల్లిక..నా చంద్ర కైసిక 
మల్లికా...నవమల్లికా 
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..ఆఆఆఆఆఆఆఆఆఆ

Monday, December 15, 2014

సూర్య-చంద్రులు--1978



సంగీతం::రమేశ్ నాయుడు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,చిత్తరంజన్
Film Directed By::Guha Naadhan 
తారాగణం::చంద్రమోహన్,మాధవి,విజయనిర్మల.

పల్లవి::

అహా..ఓహో..ఎహే..ఆహఅహ్హాహా
ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా 
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం

ఒకే మనసు..రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి..రెండు హృదయాలుగా

చరణం::1

అహా ఉహూ ఏహే..ఏ 
ఉన్నమనసు ఒకటైతే 
పెళ్ళైతే ఎవరికిస్తావు 
సగమే నా శ్రీమతికీ..ఈ
మరో సగం నీకిస్తాను 
ఆహాహహ..ఓహొహ్హోహో..ఓ
మరణమే నన్ను రమ్మంటే 
మరి నీవేమంటావవు 
మరణమైనా జీవనమైనా 
చెరిసగమంటాను..

ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా

చరణం::2

మరో జన్మ మనకుంటే 
ఏ వరం కోరుకుంటావు 
ఒకే తల్లి కడుపు పంటగా 
ఉదయించాలంటాను 
ఆహాహ్హహా..ఓహోహోహో
అన్న దమ్ములుగ జన్మిస్తే 
అది చాలదు చాలదు అంటాను 
కవలలుగా..జన్మించే జన్మ 
కావాలి కావాలి..అంటాను

ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా

Soorya-chandrulu--1978
Music::Ramesh Naayudu
Lyrics::D.C.Narayana Reddi
Singer's::S.P.Baalu,Chittaranjan
Film Directed By::Guha Nadhan
Cast::Chandramohan,Madhavi,Vijayanirmala.

:::::::::

ahaa..OhO..ehE..aahaahhaahaa
okE manasu renDu roopaalugaa 
okE oopiri renDu hRdayaalugaa 
allukunna anubandham adE adE mana bandham
allukunna anubandham adE adE mana bandham

okE manasu..renDu roopaalugaa 
okE oopiri..renDu hRdayaalugaa

::::1

ahaa uhoo EhE..E 
unnamanasu okaTaitE 
peLLaitE evarikistaavu 
sagamE naa Sreematikee..ii
marO sagam neekistaanu 
aahaahaha..OhohhOhO..O
maraNamE nannu rammanTE 
mari neevEmanTaavavu 
maraNamainaa jeevanamainaa 
cherisagamanTaanu

okE manasu renDu roopaalugaa 
okE oopiri renDu hRdayaalugaa

::::2

marO janma manakunTE 
E varam kOrukunTaavu 
okE talli kaDupu panTagaa 
udayinchaalanTaanu 
aahaahhahaa..OhOhOhO
anna dammuluga janmistE 
adi chaaladu chaaladu anTaanu 
kavalalugaa..janminchE janma 
kaavaali kaavaali..anTaanu

okae manasu renDu roopaalugaa 
okae oopiri renDu hRdayaalugaa

లక్ష్మణ రేఖ--1975



సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణ రెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::S.Gopalakrishna
తారాగణం::చంద్రమోహన్,జయసుధ,మురళిమోహన్,అల్లురామలింగయ్య,K.V.చలం,గుమ్మడి,జ్యోతిలక్ష్మీ,

పల్లవి::

ఒక మాట..ఒకేమాట 
ఒక మాట..ఒకేమాట
వలచే రెండు హృదయాలు
ఒదిగే తీయని కౌగిలిలో..ఒకటై ఉన్న చోట 

ఒక మాట ఒకేమాట..వలచే రెండు హ్రుదయాలు
ఒదిగే తీయని కౌగిలిలో..ఒకటై ఉన్న చోట ఒక మాట

చరణం::1

ఊహలలో ఊపిరిలో..ఉన్నావనీ
నావలపూ నావరమూ..నీవేననీ
ఊహలలో ఊపిరిలో..ఉన్నావనీ
నావలపూ నావరమూ..నీవేననీ
మల్లెలపైన బాసచేసి నా మనసే అన్నవేళ 
ఒక మాట ఒకేమాట..వలచే రెండు హ్రుదయాలు
ఒదిగే తీయని కౌగిలిలో..ఒకటై ఉన్న చోట
ఒక మాట..ఒకేమాట 

చరణం::2

అరవిరిచే తొలి వయసే..నీదేననీ
అది చిలికే అనుభవమే..నాదేననీ
అరవిరిచే తొలి వయసే..నీదేననీ
అది చిలికే అనుభవమే..నాదేననీ
కలువలరేకుల తలదన్నే..నీ కనులే అన్నవేళ

ఒక మాట ఒకేమాట..వలచే రెండు హ్రుదయాలు
ఒదిగే తీయని కౌగిలిలో..ఒకటై ఉన్న చోట 
ఒక మాట..ఒకేమాట

చరణం::3

ప్రతి నిమిషం..జతగానే ఉండాలనీ
బ్రతుకంతా మధురిమలే..నిండాలనీ
ప్రతి నిమిషం..జతగానే ఉండాలనీ
బ్రతుకంతా మధురిమలే..నిండాలనీ
చిలిపిగవీచే చిరుగాలి..నా చెవిలో అన్న వేళ 
ఒక మాట ఒకేమాట..వలచే రెండు హ్రుదయాలు
ఒదిగే తీయని కౌగిలిలో..ఒకటై ఉన్న చోట
ఒక మాట..ఒకేమాట
Lakshmana Rekha--1975
Music::Satyam
Lyrics::D.C.Narayana Reddi
Singer's::S.P.Balu,P.Suseela
Film Directed By::S.Gopalakrishna
Cast::Chandramohan.Jayasudha,Muralimohan,Alluramalingayya,K.V.Chalam,Gummadi,JyotiLakshmi,

::::::::

oka maaTa..okEmaaTa 
oka maaTa..okEmaaTa
valachE renDu hRdayaalu
odigE teeyani kaugililO..okaTai unna chOTa 

oka maaTa okEmaaTa..valachE renDu hrudayaalu
odigE teeyani kaugililO..okaTai unna chOTa oka maaTa

::::1

oohalalO oopirilO..unnaavanee
naavalapoo naavaramoo..neevEnanee
oohalalO oopirilO..unnaavanee
naavalapoo naavaramoo..neevEnanee
mallelapaina baasachEsi naa manasE annavELa 
oka maaTa okEmaaTa..valachE renDu hrudayaalu
odigE teeyani kaugililO..okaTai unna chOTa
oka maaTa..okEmaaTa 

::::2

aravirisE toli vayasE..needEnanee
adi chilikE anubhavamE..naadEnanee
aravirichae toli vayasE..needEnanee
adi chilikE anubhavamE..naadEnanee
kaluvalarEkula taladannE..nee kanulE annavELa

oka maaTa okEmaaTa..valachE renDu hrudayaalu
odigE teeyani kaugililO..okaTai unna chOTa 
oka maaTa..okEmaaTa

::::3

prati nimisham..jatagaanE unDaalanee
bratukantaa madhurimalE..ninDaalanee
prati nimisham..jatagaanE unDaalanee
bratukantaa madhurimalE..ninDaalanee
chilipigaveechE chirugaali..naa chevilO anna vELa 
oka maaTa okEmaaTa..valachE renDu hrudayaalu
odigE teeyani kaugililO..okaTai unna chOTa
oka maaTa..okEmaaTa

Friday, December 12, 2014

మనుషులు చేసిన దొంగలు--1977



సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ, P.సుశీల
Film Directed By::M.Mallikarjuna Rao
తారాగణం::కృష్ణ,కృష్ణం రాజు,మోహన్ బాబు,మంజుల,సంగీత,మాడా,త్యాగరాజు,పుష్పకుమారి

పల్లవి::

నీవే.. నీవే..ఓ..ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా..నీవేలే సుమా..నేనేలే ప్రియా

చరణం::1

అలలై ఊగే ఈ పూలలో..కలలై మూగే ఈ వేళలో
నను పిలిచే కోరిక నీవే..నను పిలిచే కోరిక నీవే
పగలు రేయి నా ధ్యానమై..ఏనాడైనా నాదానవై
నను తలచే రాధిక నీవే..నను తలచే రాధిక నీవే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నీవే..నీవే..ఓ..ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా..నీవేలే సుమా..నేనేలే ప్రియా

చరణం::2

పావన జీవన తీరాలలో..ఊహల కోయిల రాగలలో
నను కొలిచే దేవివి నీవే..నను కొలిచే దేవివి నీవే
అనురానికి వేదానివై..నా హృదయానికి నాదానివై
నను వలచే దైవము నీవే..నను వలచే దైవము నీవే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నీవే..నీవే..ఓ..ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా..నీవేలే సుమా..నేనేలే ప్రియా

Manushulu Chesina Dongalu--1977
Music::Satyam
Lyrics::Arudra
Singer's::Ramakrishna,Suseela
Film Directed By::M.Mallikarjuna Rao
Cast::Krishna,KrishnamRaju,MohanBabu,Manjula,Sangeeta,Mada,Tyagaraju,Pushpalatha.

::::

neevE..neevE..O..priyaa
naa madi palikina mOhanageetivi neevE sumaa
nEnElE priyaa..neevElE sumaa..nEnElE priyaa

::::1

alalai oogE ii poolalO..kalalai moogE ii vELalO
nanu pilichE kOrika neevE..nanu pilichE kOrika neevE
pagalu rEyi naa dhyaanamai..EnaaDainaa naadaanavai
nanu talachE raadhika neevE..nanu talachE raadhika neevE
aa..aa..aa..aa..aa..aa..aa..aa
neevE..neevE..O..priyaa
naa madi palikina mOhanageetivi neevE sumaa
nEnElE priyaa..neevElE sumaa..nEnElE priyaa

::::2

paavana jeevana teeraalalO..oohala kOyila raagalalO
nanu kolichE dEvivi neevE..nanu kolichE dEvivi neevE
anuraaniki vEdaanivai..naa hRdayaaniki naadaanivai
nanu valachE daivamu neevE..nanu valachE daivamu neevE
aa..aa..aa..aa..aa..aa..aa..aa
neevE..neevE..O..priyaa
naa madi palikina mOhanageetivi neevE sumaa
nEnElE priyaa..neevElE sumaa..nEnElE priyaa

Thursday, December 11, 2014

తోడు నీడ--1983




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

నా తోడువై..నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై
నా తోడువై...నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై

చరణం::1

నీ రూపం కలకాలం..నా ఏదలొ
కదలాడే అపురూప..అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల..చిరునాదం
ప్రతి ఉదయం వినిపించు..బూపాల రాగం
మన లోకం...అందాల లోకం
మన గీతం...ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం

నా తోడువై..నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై

చరణం::2

నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల
సొంపులలో పూచింది..మందార కుసుమం
నీ మమతలు..విరజల్లే విరి తేనెల
మదురిమలు విరిసింది..నవ పారిజాతం
నీ రాగం...అతిలోక బందం
నీ స్నేహం...ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం

నా తోడువై..నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై