Thursday, December 11, 2014

తోడు నీడ--1983




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

నా తోడువై..నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై
నా తోడువై...నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై

చరణం::1

నీ రూపం కలకాలం..నా ఏదలొ
కదలాడే అపురూప..అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల..చిరునాదం
ప్రతి ఉదయం వినిపించు..బూపాల రాగం
మన లోకం...అందాల లోకం
మన గీతం...ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం

నా తోడువై..నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై

చరణం::2

నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల
సొంపులలో పూచింది..మందార కుసుమం
నీ మమతలు..విరజల్లే విరి తేనెల
మదురిమలు విరిసింది..నవ పారిజాతం
నీ రాగం...అతిలోక బందం
నీ స్నేహం...ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం

నా తోడువై..నా నీడవై 
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే
చూస్తున్న...నేనే నీవై

No comments: