Tuesday, December 16, 2014

బంగారు బావ--1980



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,శ్రీదేవి.

పల్లవి::

మల్లికా ఆఆఆఆఆ 
మల్లికా..నవ మల్లికా..ఆ
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..నవ మల్లికా..ఆ
మదనోత్సవ..సంగీత సంచిక
రగిలే వేసవి..రాగమాలికా
మధుర శరదృతు..మౌనగీతికా..ఆ
రగిలే వేసవి..రాగమాలికా
మధుర శరదృతు.మౌనగీతికా
ప్రేమిక మానస..లగ్నపత్రిక
పులకింతల..తొలి చూలు పుత్రికా
మల్లికా..ఆఆఆ 
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..నవ మల్లికా..ఆఆఆ

చరణం::1

యలమావులలో..విరితావులలో
మనసున కోయిలలెగసే..వేళ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
యలమావులలో..విరితావులలో
మనసున కోయిలలెగసే..వేళ 
వయసంతా..వసంత గానమై
వయసంతా..వసంత గానమై 
జనియించిన యువ..కావ్య కన్యక
మరులు గొలుపు..మరుని బాణ దీపిక
మల్లికా..ఆఆఆ
మల్లికా..ఆఆఆ 
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..నవ మల్లికా..ఆఆఆ

చరణం::2

తొలి కోరికలే..అభిసారికలై
వలపుల కౌగిట..బిగిసేవేళా
తొలి కోరికలే..అభిసారికలై
వలపుల కౌగిట..బిగిసేవేళా
ఆ సొగసే..అమృతాభిషేకమై 
ఆ సొగసే..అమృతాభిషేకమై
తనియించిన..భువిలోన తారకా
మనసు..తెలుపు తెలుపు 
నీదే మల్లిక..నా చంద్ర కైసిక 
మల్లికా...నవమల్లికా 
మదనోత్సవ..సంగీత సంచిక
మల్లికా..ఆఆఆఆఆఆఆఆఆఆ

No comments: