Tuesday, December 23, 2014

పొరుగింటి పుల్లకూర--1976


సంగీతం::చక్రవర్తి
రచన::శ్రీశ్రీ 
గానం::V.రామకృష్ణ,బృందం.  
Film Directed By::V.Madhusoodhan Rao
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

చరణం::1

ఎండమావిలో..నీరు దొరుకునా
గాలిమేడలో..బ్రతుకు సాగునా
ఈవలి గట్టున..మేసే ఆవుకు
ఆవలి గట్టే..ఎంతో పచ్చన
తీరిందా...నీ భ్రమ ఇది
ఫలితం...లేని శ్రమ        
ఉన్నదానితో..పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

చరణం::2

దూరపు కొండలు..నునుపని తలచి
దగ్గర వారికి..దూరమైతివి
కోరిన సిరులే..ఉరులై పోయెను
చివరకి మిగిలెను..పరితాపం
స్వయంకృతం..నీ అపరాధం
స్వయంకృతం..నీ అపరాధం  
ఉన్నదానితో...పోరాటం
లేనిదానికై...ఆరాటం
ఉన్నది ఒద్దు..లేనిది ముద్దు
ఏదీ ఆశకు...హద్దు

Poruginti Pullakoora--1976
Music::Chakravarti
Lyrics::Sree Sree
Singer's::V.Ramakrishna,Brundam
Film Directed By::V.Madhusoodhan Rao
Cast::Ramakrishna,Kanchana.Muralimohan,Jayachitra,Rajababu,Mamata,Nirmala,Kakaraala.

:::::::::

unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edii aaSaku...haddu

::::1

enDamaavilO..neeru dorukunaa
gaalimEDalO..bratuku saagunaa
eevali gaTTuna..mEsE aavuku
aavali gaTTE..entO pachchana
teerindaa...nee bhrama idi
phalitam...lEni Srama        
unnadaanitO..pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edee aaSaku...haddu

::::2

doorapu konDalu..nunupani talachi
daggara vaariki..dooramaitivi
kOrina sirulE..urulai pOyenu
chivaraki migilenu..paritaapam
swayamkRtam..nee aparaadham
swayamkRtam..nee aparaadham  
unnadaanitO...pOraaTam
lEnidaanikai...aaraaTam
unnadi oddu..lEnidi muddu
Edee aaSaku...haddu

No comments: