Thursday, January 26, 2012

HAPPY REPUBLIC DAY

మితృలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Animated Indian Flag Graphic














free ecards


దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే

నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే

అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా

ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ...అందామందరం

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే

అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయరాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైన
భరతమాతకొకటేలేరా

రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా...

వందేమాతరం అందామందరం
వందేమాతరం ఓ...అందామందరం
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...
వందేమాతరం...వందేమాతరం...

దీక్ష--1974



సంగీతం::P.నాగేశ్వరరావు
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::వాణీజయరాం 
తారాగణం::N.T.రామారావు, జమున, అంజలీదేవి, రాజబాబు, ప్రభాకర రెడ్డి.

పల్లవి::

రాక రాక..వచ్చావు మావా..ఆఆఆ  
వేచి వేచి..ఉన్నది భామా..ఆ ఆ ఆ..మ్మ్ హూ 
రాక రాక..వచ్చావు మావా..ఆఆఆ  
వేచి వేచి..ఉన్నది భామా..ఆ ఆ ఆ..మ్మ్ హూ
కదిలే అందాలు..కావాలా
కదిలించే మధురసం..కావాలా
కదిలే అందాలు..కావాలా
కదిలించే మధురసం..కావాలా 
ఏది కావాలి..నీకేదికావాలి
ఓ రంగూను...మావా..ఆఆఆ..హాయ్ 
రాక రాక వచ్చావు..మావా..ఆఆఆ  
వేచి వేచి ఉన్నది..భామా..ఆ ఆ ఆ..మ్మ్ హూ   

చరణం::1

మత్తులోనా..ఆ..మునిగిపోదామా హాయిగా
మత్తులోనా..ఆ..మునిగిపోదామా హాయిగా
వయసు నాదిరా..ఆ..వలపు నీదిరా..ఆ
వయసు నాదిరా..ఆ..వలపు నీదిరా..ఆ
నిన్నే తలచాను నిద్దుర మరచాను
మల్లెపూల పాంపు...పిలిచేరా
రాక రాక వచ్చావు..మావా..ఆఆఆ  
వేచి వేచి..ఉన్నది భామా..ఆ ఆ ఆ..మ్మ్ హూ
కదిలే అందాలు...కావాలా
కదిలించే మధురసం...కావాలా
కదిలే అందాలు..కావాలా
కదిలించే మధురసం..కావాలా..ఆ..హా హా హా  

సిపాయి చిన్నయ్య--1974














సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరీ
తారాగణం::అక్కినేని,K.R.విజయ,జగ్గయ్య,భారతి,నాగభూషణం.

పల్లవి::

ఒరే మావా..ఆఆ ఆఆ ఆఆ హ్హా
ఒరే మావా..ఆ ఆ ఆ ఆ ఆ హ్హా
ఒరే మావా యేసుకోరా సుక్క
రెచ్చిపోతేను చక్కని సుక్క
యేసుకో యేసుకో సుక్క యేసుకొర్రా
ఒరే మావా మావా మావా మావా..ఆ  

అరే మావా నంజుకొర ముక్కా
అది నమిలేవు దసిని చెక్కా
నంజుకో నంజుకో నంజుకోర ముక్కా

ఒరే మావా యేసుకోరా సుక్క
రెచ్చిపోతేను చక్కని సుక్క
యేసుకో యేసుకో సుక్క యేసుకొర్ర 

చరణం::1

ఈ రేతిరి సేయరా జల్సా
హై ఎక్కాలి తగ్గని నిషా
ఊఉ..హయ్..
ఈ రేతిరి సేయరా జల్సా
హై ఎక్కాలి తగ్గని నిషా
యేసే సుక్కా..కొరికే ముక్కా
రెండుకలిస్తే..వరెవ్వా
మేఘాలలో..ఊగాలిరా
తాగర మల్లి మల్లీ
ఈ కైపులో..మైమరపులో
ఒరే మావా...ఆ ఆ ఆ ఆహ్హా
ఒరే మావా...ఆ ఆ ఆ ఆహ్హా

చరణం::2

అహా..పోకిరి సూపులు..నీవి
హై..పొగరు వగరు..నాది
ఏది సలవ..తీపి కారం
ఇద్దరిలోనా..ఉన్నై 
నీ కంటికీ..సోకైనదీ
నేనే నేనే..కాదా..రంగేళినీ
సింగారినీ..రంభ మేనకనౌతా

ఒరే మావా యేసుకోరా సుక్క
రెచ్చిపోతేను చక్కని సుక్క
యేసుకో యేసుకో సుక్క యేసుకొర్ర

చరణం::3

అహా..పిల్లే కదర..చులక్కా
అది కల్లును మించిన..నిషా..ఆ
ఆహా హా హా...
అహా..పిల్లే కదర..చులక్కా 
అది కల్లును మించిన..నిషా..ఆ
పిల్లా..కల్లూ..పెదిమలకొద్ది 
అల్లిబిల్లి...తమాషా
మందెందుకో..మగరాయడా..అందం
అచ్చిబరాటా..అందాలనూ..
తాగేయ్యరా..అప్పుడు సూడుమజాకా

ఒరే మావా...ఆ ఆ ఆ ఆహ్హా
ఒరే మావా...ఆ ఆ ఆ ఆహ్హా
ఒరే మావా మావా మావా మావా..ఆ 

ఒరే మావా యేసుకోరా సుక్క
రెచ్చిపోతేను చక్కని సుక్క
యేసుకో యేసుకో సుక్క యేసుకొర్ర

Sipaayi Chinnayya--1979
Music::M.S.Viswanathan
Lyrics::Arudra
Singer::L.R.Iswarii
Cast::Akkineni,K.R.Vijaya,Jaggayya,Bharathi,Naagabhushanam.

::::

orE maavaa..AA AA AA hhaa
orE maavaa..aa aa aa aa aa hhaa
orE maavaa yEsukOraa sukka
rechchipOtEnu chakkani sukka
yEsukO yEsukO sukka yEsukorraa
orE maavaa maavaa maavaa maavaa..aa  

arE maavaa nanjukora mukkaa
adi namilEvu dasini chekkaa
nanjukO nanjukO nanjukOra mukkaa

orE maavaa yEsukOraa sukka
rechchipOtEnu chakkani sukka
yEsukO yEsukO sukka yEsukorra 

::::1

ii rEtiri sEyaraa jalsaa
hai ekkaali taggani nishaa
uuu..hay..
ii rEtiri sEyaraa jalsaa
hai ekkaali taggani nishaa
yEsE sukkaa..korikE mukkaa
renDukalistE..varevvaa
mEghaalalO..Ugaaliraa
taagara malli mallii
ii kaipulO..maimarapulO
orE maavaa...aa aa aa aahhaa
orE maavaa...aa aa aa aahhaa

::::2

ahaa..pOkiri soopulu..neevi
hai..pogaru vagaru..naadi
Edi salava..teepi kaaram
iddarilOnaa..unnai 
nee kanTikii..sOkainadii
nEnE nEnE..kaadaa..rangELinii
singaarinii..rambha mEnakanoutaa

orE maavaa yEsukOraa sukka
rechchipOtEnu chakkani sukka
yEsukO yEsukO sukka yEsukorra

::::3

ahaa..pillE kadara..chulakkaa
adi kallunu minchina..nishaa..aa
aahaa haa haa...
ahaa..pillE kadara..chulakkaa 
adi kallunu minchina..nishaa..aa
pillaa..kalluu..pedimalakoddi 
allibilli...tamaashaa
mandendukO..magaraayaDaa..andam
achchibaraaTaa..andaalanuu..
taagEyyaraa..appuDu sUDumajaakaa

orE maavaa...aa aa aa aahhaa
orE maavaa...aa aa aa aahhaa
orE maavaa maavaa maavaa maavaa..aa 

orE maavaa yEsukOraa sukka
rechchipOtEnu chakkani sukka

yEsukO yEsukO sukka yEsukorra


Sunday, January 22, 2012

పగబట్టిన పడుచు--1971


సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.జానకి 
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

రా..రారాదా..ఓ ప్రియా..ఓహోహో ప్రియా ప్రియా ప్రియా
నీకోసమె నిలిచెనుచెలి..నాపై దయరాదా..రా..రారాదా  

చరణం::1

ఓ..మనసే మల్లెగ విరిసింది విరిసింది
ఒక తుమ్మెదకై వయసే కసిగా వేచింది వేచింది ఒక మగసిరికై
బంధాలను తెంచి అందాలను దోచి – నన్నందుకు పోరాదా 
రా..రారాదా..ఓ ప్రియా..ఓహోహో ప్రియా ప్రియా ప్రియా 
నీకోసమె నిలిచెనుచెలి నాపై దయరాదా..రా..రారాదా  

చరణం::2
   
ఓ..వలపే మధువై తొణికింది తొణికింది 
నీ పెదవులపై చెలియే వధువై నిలిచింది నిలిచింది 
నీ కౌగిలికై ఆ..లల..బంధాలను తెంచి 
అందాలను దోచి..నన్నందుకు పోరాదా 
రా..రారాదా..ఓ ప్రియా..ఓహోహో ప్రియా ప్రియా ప్రియా
నీకోసమె నిలిచెనుచెలి నాపై దయరాదా..రా..రారాదా 

Friday, January 20, 2012

మూగప్రేమ--1971




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::L.R.ఈశ్వరీ , P.సుశీల 
తారాగణం::శోభన్ బాబు,వాణిశ్రీ, విజయలలిత,ప్రభాకర రెడ్డి, సూర్యకాంతం,రమణారెడ్డి,G.వరలక్ష్మి

పల్లవి::

నే నేమి ఎరుగని..దాననా పసిపాపనా
పో పోవె పిచ్చిదాన..నా కన్నీ తెలుసును
నీకన్నా నువ్వేమన్నా..పో పోవె పిచ్చిదాన 

చరణం::1

అన్నది జరిపించాను..మనసన్నది మూసేశాను
అన్నది జరిపించాను..మనసన్నది మూసేశాను
మూసిన తలుపులు..తెరుచుకోవు
మూసిన తలుపులు..తెరుచుకోవు
ఆశలు నా కిక లేనేలేవు
ఆశలు నా కిక...లేనేలేవు
పో పోవె పిచ్చిదాన..నా కన్నీ తెలుసును 
నీకన్నా నువ్వేమన్నా..పో పోవె పిచ్చిదాన 

చరణం::2

దేవుడు నిద్దురపోయాడు..మన రాతలు మార్చిరాశాడు
దేవుడు నిద్దురపోయాడు..మన రాతలు మార్చిరాశాడు
మారిన రాతలు మార్చమని..మారిన రాతలు మార్చమని 
నా మనసును నిద్దుర లేపాడు..నా మనసును నిద్దుర లేపాడు
పో పోవె పిచ్చిదాన..నా కన్నీ తెలుసును 
నీకన్నా నువ్వేమన్నా..పో పోవె పిచ్చిదాన

చరణం::3

దీపం వెలుగువు నీ వైతే..నీ రూపం నీడగా నేనుంటా
దీపం వెలుగువు నీ వైతే..నీ రూపం నీడగా నేనుంటా
వెలుగు నీడ కలవవులే..వెలుగు నీడ కలవవులే
వెన్నెల చంద్రుని వీడదులే..వెన్నెల చంద్రుని వీడదులే        
పో పోవె పిచ్చిదాన నే నేమి ఎరుగని..దాననా 
పసిపాపనా..ఆ..పో పోవె..పిచ్చిదాన

Wednesday, January 18, 2012

ఎన్.టి.ఆర్. కు వర్ధంతి నివాళులు






















రాముడు భీముడు 1964
సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::ఘంటసాల,సుశీల

తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..

చలిగాలి రమ్మనుచు పిలిచిందిలే..చెలి చూపు నీ పైన నిలిచిందిలే..
చలిగాలి రమ్మనుచు పిలిచిందిలే..చెలి చూపు నీ పైన నిలిచిందిలే..

ఏముందిలే..ఇపుదేముందిలే..
ఏముందిలే..ఇపుదేముందిలే..
మురిపించు కాలమ్ము ముందిందిలే..నీ ముందిందిలే..

తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..

వరహాల చిరునవ్వు కురిపించవా..పరువాల రాగాలు పలికించవా..
ఆఆ ఆ..ఓఓఓ..ఆ ఆ ఆ ఆ
వరహాల చిరునవ్వు కురిపించవా..పరువాల రాగాలు పలికించవా..

అవునందునా..కాదందునా
అవునందునా..కాదందునా
అయ్యరే విధిలీల అనుకొందునా..అనుకొందునా..

తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..

సొగసైన కనులేమో నాకున్నవి..చురుకైన మనసేమో నీకున్నది..
సొగసైన కనులేమో నాకున్నవి..చురుకైన మనసేమో నీకున్నది..
కనులేమిటొ..ఈ కథ ఏమిటో
కనులేమిటొ..ఈ కథ ఏమిటో
శృతిమించి రాగాన పడనున్నది..పడుతున్నది

అ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..

๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑



రాముడు భీముడు 1964
సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::ఘంటసాల,సుశీల

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా

అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లగు చున్నది
అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లగు చున్నది

అదే అదే అదే....

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా

అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది

నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహాహ ఆ హా అహహ ఆహా అహహాహహహా
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి

ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉఉనవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉఉనవి
ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవి

అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది

చరణం::2

నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహాహ ఆ హా అహహ ఆహా అహహాహహహా
నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను

ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెను

అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లగు చున్నది
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది
అదే అదే అదే
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది.


๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑




మంచి మనిషి 1964
సంగీతం::చలపతి రావ్-రాజేశ్వర రావు
రచన::సినారె
గానం::ఘటసాల,సుశీల

అంతగా నను చూడకు
ష్..మాటాడకు
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు

హోయ్ అంతగా నను చూడకు

చలిచలిగాలులు వీచెను..సన్నని మంటలు లేచెను
అహహహా..
చలిచలిగాలులు వీచెను..సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను..వలపుల వీణలు తేలించెను

హోయ్ అంతగా నను చూడకు

జిలిబిలి ఊహలు రేగెను.నా చేతులు నీకై సాగెను
అ అ ఆ . . .
జిలిబిలి ఊహలు రేగె.ను.నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను..పదునౌ చూపులు బాధించెను..హోయ్
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు,
హోయ్ అంతగా నను చూడకు

వాలుగ నిన్నే చూడనీ..కలకాలము నీలో దాగనీ
అహహహా...
వాలుగ నిన్నే చూడనీ..కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ..పువ్వులసంకెల బిగించనీ

_హోయ్_ అంతగా నను చూడకు

ష్...మాటాడకు
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు
_హోయ్_ అంతగా నను చూడకు



అడుగుజాడలు--1966
సంగీతం::మాష్టర్ వేణు
రచన::సినారె
గానం:::ఘంటసాల,జానకి

పల్లవి::

మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ

మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ

చరణం::1

చలి చలి గాలులు చిలిపిగ వీచే
జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వలపే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే..సవ్వడి చేసే

మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ

చరణం::2

పిలువని కనులే పిలిచెను నన్నే
పలుకని జాబిలీ వలిచెను నన్నే
అందాలేవో..అలలై ఆడే
అందని కౌగిలీ అందెను నేడే
అందని కౌగిలీ అందెను నేడే
అందెను నేడే..

మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ

చరణం::3

సొగసులు విరిసే వెన్నెలలోన
యెగిసే ఊహల పల్లకి పైన
నీవె నేనై పయనించేమ
నేనే నీవై పయనించేమ
జీవన రాగం పలికించేమ
జీవన రాగం పలికించేమ..పలికించేమ

మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
అహహా ఆ ఆ అహహా అహహా ఆ ఆ

๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑

Tuesday, January 17, 2012

పగబట్టిన పడుచు--1971












సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::P.సుశీల  
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో..ఓహో
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు 
నాలో కదలె..ఈ వేళ  
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు 
నాలో కదలే..ఈ వేళ 

తుంటరి వయసేమన్నది
తూగాడు నడుమేమన్నది  
చెరలాడు పైటేమన్నది
విరహాలు ఇక చాలన్నది   
తుంటరి వయసేమన్నది
తూగాడు నడుమేమన్నది   
చెరలాడు పైటేమన్నది
విరహాలు ఇక చాలన్నది   
రారా..ఓ చిన్నవాడా
వలపే నీదేరా..నీదే లేరా    
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు 
నాలో కదలే..ఈ వేళ 

చరణం::1

మాధవుడందని..రాధనై 
ఆరాధ తీయని..బాధనై 
ఆ బాధ మోయని..గాధనై 
ఎన్నాళ్ళు జాగ..తిరిగేను  
మాధవుడందని..రాధనై 
ఆరాధ తీయని..బాధనై 
ఆ బాధ మోయని..గాధనై 
ఎన్నాళ్ళు జాగ..తిరిగేను   
రారా..ఓ చెలికాడా నేనే 
ఆ రాధనురా..నీ రాధనురా 
ఏవో మౌన..రాగాలు 
ఏవో మధుర..భావాలు
నాలో కదలే..ఈ వేళ 

దేవదాసు--1974




















సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

పల్లవి::

ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం ఊ
తిరిగి రాని పయనం తిరిగి రాని పయనం
ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం

ఈ సమయం భ్రాంతి సుమా..ఆ పయనం మాయ సుమా
అంటున్న నేను.. వింటున్న నీవు
అంతా మాయసుమా..అంతా భ్రాంతి సుమా

చరణం::1

అయిదు సరుకుల మేళవింపుతో..తొమ్మిది తలుపుల భవనం
అందులోన నివాసం మాని హంస చేరురా గగనం
తానే లేని సదనంలో తలుపులు ఎందుకురా 
తిరిగి రానే రాని పయనంలో పిలుపులు ఎందుకురా
ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం 

చరణం::2

మరలా పుట్టుక..మరలా చచ్చుట ఇరుసే లేని చక్రం
వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం
రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు
అన్ని అంచెలు దాటిన పిదప ఉన్నది కడపటి రేవు 

ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం

Monday, January 16, 2012

సోగ్గాడి పెళ్ళాం--1996


సంగీతం::కోటి
రచన::భువనచంద్ర
గానం::S.P.బాలు,S.చిత్ర


పల్లవి::

హాయ్..హాయ్..హాయ్..హాయ్..హాయ్..హాయ్..

కలికి పెట్టిన ముగ్గు కళకళలాడిందే తుమ్మెదా ఓ తుమ్మెదా
మురిపాల సంక్రాంతి ముంగిట్లో కొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..చలిమంటా వెలుగుల్లు తుమ్మెదా ఓ తుమ్మెదా
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా..సరదాలు తెచ్చిందే తుమ్మెదా
కొత్తాధాన్యాలతో ..కోడిపందాలతో..ఊరే ఉప్పోంగుతుంటే..
ఇంటింటా..ఆ..పేరంటం..ఊరంతా..ఆ..ఉల్లాసం..
కొత్తా అల్లుళ్ళతో ..కొంటే మరదళ్ళతో..పొంగే హేమంత సిరులూ..ఊ..

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..గొబ్బియళ్ళో
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..గొబ్బియళ్ళో
మంచి మర్యాదనీ..పాపాపుణ్యాలనీ..నమ్మే మన పల్లెటూళ్ళు
న్యాయం మాస్వాశనీ..ధర్మం మా బాటనీ..చెబుతాయి స్వాగతాలు
నీ నా గొప్పోళ్ళనీ మాటలేదు..నీతీ నిజాయితీ మాసిపోదూ
మచ్చలేని మనసుమాదని..మంచి తెలిసి మనసు మాది
ప్రతి ఇల్లు బొమ్మరిల్లూ..

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా..సరదాలు తెచ్చిందే తుమ్మెదా

చరణం::2

ఉయ్..ఉయ్..ఉయ్..ఉయ్..ఉయ్..ఉయ్..
పాటీ పంచామౄతం మనసే బృందావనం
తదిస్తేనే వళ్ళు ఝల్లూ..మాటే మకరందమూ
పూసె సిరి గధమూ..చిరునవ్వే స్వాతిజల్లూ
జంటా తాళలతో మేజువాణీ..జోడు మద్దెళ్ళనీ మోదిపోనీ
జంటకొట్టి పంటరాయి..చెప్పలేని పంటవాయి
వయసే అల్లాడిపోయే..

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా..హోయ్..సరదాలు తెచ్చిందే తుమ్మెదా
హేయ్..కొత్తాధాన్యాలతో..కోడిపందాలతో..ఊరే ఉప్పోంగుతుంటే..
ఇంటింటా..ఆ..పేరంటం..ఊరంతా..ఆ..ఉల్లాసం..
కొత్తా అల్లుళ్ళతో ..కొంటే మరదళ్ళతో..పొంగే హేమంత సిరులూ..ఊ..

Saturday, January 14, 2012

పగబట్టిన పడుచు--1971


సంగీతం::M.రంగారావ్ 
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.జానకి 
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి, 

పల్లవి::

ఓయబ్బో..నిషాలో ఉన్నానని 
ఉలికి పడుతు..వున్నావా 
మరికాస్తా తీసుకోనీ..మరికాస్తా
ఓయబ్బో..నిషాలో ఉన్నానని 
ఉలికి పడుతు..వున్నావా 
మరికాస్తా తీసుకోనీ..మరికాస్తా
ఊం..హు..ఊం..హు..ఊం..హు

చరణం::1

ఇన్నినాళ్ళ దాహమేదొ ఇపుడు రగులుతున్నది
ఇన్నినాళ్ళ దాహమేదొ ఇపుడు రగులుతున్నది 
పలుక లేని బాధయేదొ పడగవిప్పుతున్నది
నీవు పెంచుకున్న పరువు నీరుగారుతున్నది 
మరికాస్తా తీసుకోని మరికాస్తా
ఊ..ఓయబ్బో..నిషాలో ఉన్నానని 
ఉలికి పడుతు..వున్నావా 
మరికాస్తా తీసుకోని..మరికాస్తా
ఓయబ్బో..నిషాలో ఉన్నానని

చరణం::2

కిలాడి వేటకాడి ముందు లేడి ఆడుతున్నది 
కిలాడి వేటకాడి ముందు లేడి ఆడుతున్నది 
ఒకొక్క చుక్కతో మరింత ఊపు పెరుగుతున్నది 
తాగిందినేనైతే తమకెందుకు దిగుతున్నది
మరికాస్తా తీసుకోని మరికాస్తా 
ఓయబ్బో..నిషాలో ఉన్నానని ఉలికి పడుతు వున్నావా 
మరికాస్తా తీసుకోని మరికాస్తా 
ఓయబ్బో..నిషాలో ఉన్నానని ఉలికి పడుతు వున్నావా 
మరికాస్తా తీసుకోని మరికాస్తా
మరికాస్తా తీసుకోని మరికాస్తా మరికాస్తా తీసుకోని మరికాస్తా