రాముడు భీముడు 1964
సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::ఘంటసాల,సుశీల
తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
చలిగాలి రమ్మనుచు పిలిచిందిలే..చెలి చూపు నీ పైన నిలిచిందిలే..
చలిగాలి రమ్మనుచు పిలిచిందిలే..చెలి చూపు నీ పైన నిలిచిందిలే..
ఏముందిలే..ఇపుదేముందిలే..
ఏముందిలే..ఇపుదేముందిలే..
మురిపించు కాలమ్ము ముందిందిలే..నీ ముందిందిలే..
తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
వరహాల చిరునవ్వు కురిపించవా..పరువాల రాగాలు పలికించవా..
ఆఆ ఆ..ఓఓఓ..ఆ ఆ ఆ ఆ
వరహాల చిరునవ్వు కురిపించవా..పరువాల రాగాలు పలికించవా..
అవునందునా..కాదందునా
అవునందునా..కాదందునా
అయ్యరే విధిలీల అనుకొందునా..అనుకొందునా..
తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
సొగసైన కనులేమో నాకున్నవి..చురుకైన మనసేమో నీకున్నది..
సొగసైన కనులేమో నాకున్నవి..చురుకైన మనసేమో నీకున్నది..
కనులేమిటొ..ఈ కథ ఏమిటో
కనులేమిటొ..ఈ కథ ఏమిటో
శృతిమించి రాగాన పడనున్నది..పడుతున్నది
అ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిసిందిలే..తెలిసిందిలే..నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑
రాముడు భీముడు 1964
సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::ఘంటసాల,సుశీల
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లగు చున్నది
అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లగు చున్నది
అదే అదే అదే....
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహాహ ఆ హా అహహ ఆహా అహహాహహహా
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉఉనవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉఉనవి
ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవి
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది
చరణం::2
నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహాహ ఆ హా అహహ ఆహా అహహాహహహా
నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెను
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లగు చున్నది
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది
అదే అదే అదే
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది.
๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑
మంచి మనిషి 1964
సంగీతం::చలపతి రావ్-రాజేశ్వర రావు
రచన::సినారె
గానం::ఘటసాల,సుశీల
అంతగా నను చూడకు
ష్..మాటాడకు
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
చలిచలిగాలులు వీచెను..సన్నని మంటలు లేచెను
అహహహా..
చలిచలిగాలులు వీచెను..సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను..వలపుల వీణలు తేలించెను
హోయ్ అంతగా నను చూడకు
జిలిబిలి ఊహలు రేగెను.నా చేతులు నీకై సాగెను
అ అ ఆ . . .
జిలిబిలి ఊహలు రేగె.ను.నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను..పదునౌ చూపులు బాధించెను..హోయ్
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు,
హోయ్ అంతగా నను చూడకు
వాలుగ నిన్నే చూడనీ..కలకాలము నీలో దాగనీ
అహహహా...
వాలుగ నిన్నే చూడనీ..కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ..పువ్వులసంకెల బిగించనీ
_హోయ్_ అంతగా నను చూడకు
ష్...మాటాడకు
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు
_హోయ్_ అంతగా నను చూడకు
అడుగుజాడలు--1966
సంగీతం::మాష్టర్ వేణు
రచన::సినారె
గానం:::ఘంటసాల,జానకి
పల్లవి::
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
చరణం::1
చలి చలి గాలులు చిలిపిగ వీచే
జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వలపే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే..సవ్వడి చేసే
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
చరణం::2
పిలువని కనులే పిలిచెను నన్నే
పలుకని జాబిలీ వలిచెను నన్నే
అందాలేవో..అలలై ఆడే
అందని కౌగిలీ అందెను నేడే
అందని కౌగిలీ అందెను నేడే
అందెను నేడే..
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
చరణం::3
సొగసులు విరిసే వెన్నెలలోన
యెగిసే ఊహల పల్లకి పైన
నీవె నేనై పయనించేమ
నేనే నీవై పయనించేమ
జీవన రాగం పలికించేమ
జీవన రాగం పలికించేమ..పలికించేమ
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
అహహా ఆ ఆ అహహా అహహా ఆ ఆ
๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑๑♥๑ ๑♥๑
No comments:
Post a Comment