Tuesday, December 18, 2007

కన్నవారి కలలు --1974



సంగీతం::కుమార్
రచన::రాజశ్రీ 
గానం::V.రామక్రిష్ణ

తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి

రాధా...
రాధా...
రాధా...
పులకింతరాధా

ఎవరికైన పులకింతరాధా
అందాలు కనువిందు చేస్తుంటే
నీ అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా
చూసే కనులకు నోరుంటే...
అది మధురగీతమే పాడగా
మధురగీతమే పాడగా

అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా !!
చల్లగాలుల పల్లకీలలో
నల్ల బమ్ములు రేగేనూ
అంబరాన ఆ సంబరాలుగని
గిరులబారులే మురిసెనూ
పలుకురాని ప్రకౄతి నాకు
పలికె స్వాగతాలూ
నిండుగా కలలు పండగా
నాదుడెందమే నిండగా

అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా 


ఎవరి కురులలో నలుపు చూసి
తుమెదలు చిన్నబోయేనూ
ఎవరి బుగ్గలా ఎరుపు చూసి
చెంగెలువ సిగ్గు చెందేనూ
అవే సోయగాల కురులు
అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగా మనసు చెదరగా
కనులకెదురుగా వెలిసెనూ

అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా 


ఈ సరస్సులో ఇంద్రధనస్సులో
వింత సొగసు ఏముందీ
ఓరచూపులా సోగ కనులలో
కోటి సొగసులా గనివుందీ
చెలియ పాల నవ్వులోన
మరులజల్లువానా
కురిసెనే వలపు విరిసెనే
తలపు చిందులే వేసేనే

అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా
చూసే కనులకు నోరుంటే...
అది మధురగీతమే పాడగా
మధురగీతమే పాడగా

Monday, December 17, 2007

వీరాభిమన్యు --1965




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల , P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

పల్లవి::

రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు


రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె

నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు

ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు


చరణం::1

తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ?
తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ?
పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా
పరవశించీ పడుచువానికి మధువు కానీ సొగసేలా
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగా నీ మనసును దోచిన మన్మధుడితడే కాబోలు

చరణం::2


కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా
కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగా నీ మనసును దోచిన మన్మధుడితడే కాబోలు
కన్నెక రతియే కాబోలు
మన్మధుడితడే కాబోలు

వీరాభిమన్యు --1965::శహన::రాగం




సంగీతం::KV.మహాదేవన్
రచన
::ఆరుద్ర
గానం
::ఘంటసాల,P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 

తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

రాగం::శహన


చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి
చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి

చూచీ వలచీ చెంతకు చేరీ
నా సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి
చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

చరణం::1


అందాలన్నీ దోచీ ఆనందపుటంచుల చూచీ
అందాలన్నీ దోచీ ఆనందపుటంచుల చూచీ
సందిట బందీ చేసి
సందిట బందీ చేసి
నా బందీ వశమై పోతీ

 చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

చరణం::2


నూతన వధువై నిలచీ వరుని వలపుల మధువై మారి
నూతన వధువై నిలచీ వరుని వలపుల మధువై మారి
సఖునీ ఒడిలో సురిగీ
సఖునీ ఒడిలో సురిగీ
కోటి సుఖముల శిఖరము నైతి

చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి 


చరణం::3


వలపు తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
వలపు తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
నీవే జగమై నీలో సగమై..
నేటికి నిండుగ పండితి ...

!! చూచీ వలచీ చెంతకు పిలచీ
నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి

చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి
 

వీరాభిమన్యు --1965




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

పల్లవి::

ఆ...ఆ..ఆ..
అహా..ఆహా..హా

ఓహో...ఒహొ...
అదిగో నవలోకం
వెలసే మనకోసం

అదిగో నవలోకం..వెలసే మనకోసం
అదిగో నవలోకం..వెలసే మనకోసం

చరణం::1


నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో
ఎచట సుధ కలదో
అచటె మనముందామా..ఆ..ఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం

చరణం::2


పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఎచట హృదయాలూ
ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా..ఆ..ఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం
అదిగో నవలోకం..వెలసే మనకోసం

Sunday, December 16, 2007

జీవనజ్యోతి--1975




సంగీతం::K.V.,మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::K.Viswanath
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,శుభ,నిర్మల,అల్లు రామలింగయ్య,ముక్కామల,బేబివరలక్ష్మీ,సీతాలత,పద్మశ్రీ,రమోల.  

పల్లవి::

ఉష్....
ముద్దుల మా బాబు..నిద్దరోతున్నాడు
సద్దుచేసారంటే..వులికులికి పడతాదు
ముద్దుల మా బాబు..నిద్దరోతున్నాడు
సద్దుచేసారంటే..వులికులికి పడతాదు
గోపాలక్రిష్ణయ్య..రేపల్లెకు వెలుగూ
గోపాలక్రిష్ణయ్య..రేపల్లెకు వెలుగూ
మాచిన్ని కన్నయ్యా..లోకానికే వెలుగు
ముద్దుల మా బాబు..నిద్దరోతున్నాడు
సద్దుచేసారంటే..వులికులికి పడతాదు

చరణం::1

చల్లగా నిదరోయి..బాబూ
నిదురలో మెల్లగా..నవ్వుకొనే బాబు
చల్లగా నిదరోయి..బాబూ
నిదురలో మెల్లగా..నవ్వుకొనే బాబు
ఏమికలలు కంటున్నాడో..తెలుసా తెలుసా
ఏ జన్మకూ..ఈ తల్లె కావాలనీ
ఏ జన్మకూ..ఈ తల్లే కావాలనీ
ఈ వడిలోనే..ఆదమరచి వుండాలనీ
జుజుజు జుజూ..జుజుజు జుజూ 
జుజుజు జుజూ..జుజుజు జుజూ
ముద్దుల మా బాబు..నిద్దరోతున్నాడు
సద్దుచేసారంటే..వులికులికి పడతాదు

చరణం::2

దేవుడే నా ఎదురుగ..నిలబడితే
ఏమికావాలి తల్లీయని..అడిగితే
దేవుడే నా ఎదురుగ..నిలబడితే
ఏమికావాలి తల్లీయని..అడిగితే
నేనేమని అంటానో..తెలుసా తెలుసా
నీ నీడలో..మావాడు పెరగాలనీ
నీ నీడలో..మావాడు పెరగాలనీ
పెరిగి నీలాగె..పేరు తెచ్చుకోవాలనీ
జుజుజు జుజూ..జుజుజు జుజూ
జుజుజు జుజూ..జుజుజు జుజూ..ఉహూ
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు ఉహు
సద్దుచేసారంటే..వులికులికి పడతాదు
జుజుజు జుజూ..జుజుజు జుజూ
జుజుజు జుజూ..జుజుజు జుజూ..ఉష్

Jeevanajyothi--1975
Music::K.V.Mahaadevan
Lyrics::D.C.Naraayanareddi
Singer's::P.Suseela
Film Directed By::K.Viswanath
Cast::Sobhanbabu,Vanisree,K,Satyanarayana,Rajababu,Ramaprabha,Subha,Nirmalamma,AlluraamalingayyaMukkaamala,Baby Varalakshmii.Seetaalatha,Padmasree,Ramola.

:::::::::::::::::::::

ush....
muddula maa baabu..niddarOtunnaaDu
sadduchEsaaranTE..vulikuliki paDataadu
muddula maa baabu..niddarOtunnaaDu
sadduchEsaaranTE..vulikuliki paDataadu
gOpaalakrishNayya..rEpalleku velugoo
gOpaalakrishNayya..rEpalleku velugoo
maachinni kannayyaa..lOkaanikE velugu
muddula maa baabu..niddarOtunnaaDu
sadduchEsaaranTE..vulikuliki paDataadu

::::1

challagaa nidarOyi..baaboo
niduralO mellagaa..navvukonE baabu
challagaa nidarOyi..baaboo
niduralO mellagaa..navvukonE baabu
Emikalalu kanTunnaaDO..telusaa telusaa
E janmakoo..ii talle kaavaalanii
E janmakoo..ii tallae kaavaalanii
ii vaDilOnE..aadamarachi vunDaalanii
jujuju jujoo..jujuju jujoo 
jujuju jujoo..jujuju jujoo
muddula maa baabu..niddarOtunnaaDu
sadduchEsaaranTE..vulikuliki paDataadu

::::2

dEvuDE naa eduruga..nilabaDitE
Emikaavaali talleeyani..aDigitE
dEvuDE naa eduruga..nilabaDitE
Emikaavaali talleeyani..aDigitE
nEnEmani anTaanO..telusaa telusaa
nee neeDalO..maavaaDu peragaalanii
nee neeDalO..maavaaDu peragaalanii
perigi neelaage..pEru techchukOvaalanii
jujuju jujoo..jujuju jujoo
jujuju jujoo..jujuju jujoo..uhoo
muddula maa baabu niddarOtunnaaDu uhu
sadduchEsaaranTE..vulikuliki paDataadu
jujuju jujoo..jujuju jujoo
jujuju jujoo..jujuju jujoo..ush

జీవనజ్యోతి--1975




సంగీతం::K.V.,మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::K.Viswanaath
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,శుభ,నిర్మల,అల్లు రామలింగయ్య,ముక్కామల,బేబివరలక్ష్మీ,సీతాలత,పద్మశ్రీ,రమోల.  

పల్లవి::

సిన్నివో సిన్నీ..ఓ..సన్నజాజుల సిన్ని
సిన్నివో సిన్నీ..ఓ..సన్నజాజుల సిన్ని 
ఓ...వన్నెగాజుల...సిన్ని
తుర్రుమని నువ్...వెళ్ళిపోతే
తూరుపు దిక్కు...ఆపేస్తుంది
ఉరుమురిమి...చూసావంటే
ఉత్తర దిక్కు...ఊపేస్తుంది

జింజిర్ జింజిర్ జింజిర్ జిన్
సిన్నివో సిన్నీ..ఓ..సన్నజాజుల సిన్ని
ఓ...వన్నెగాజుల..సిన్నీ


కల్లబొలి మాటలతో అల్లరి పెడితే..నన్నల్లరి పెడితే
వెల్లువ గోదారిలా కమ్మేస్తాను..నిన్ను కమ్మేస్తాను

గోదారి పొంగల్లె నామీదికి వురికొస్తే
గొదారి పొంగల్లె నామీదికి వురికొస్తే
రాదారి పడవల్లె తేలి తేలి పోతాను
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్

సిన్నివో సిన్నీ..ఓ..సన్నజాజుల సిన్నీ
ఓ...వన్నెగాజుల...సిన్నీ

చరణం::1

కొమ్మ మీది చిలకమ్మకు..కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి..అలకే అందం
కొమ్మ మీది చిలకమ్మకు..కులుకే అందం
ఈ కోనసీమ బుల్లెమ్మకి..అలకే అందం

గుటిలోని గోరింకకు..చాటు సరసం అందం
గుటిలోని గోరింకకు..చాటు సరసం అందం
ఈ గుంటూరి పిలగానికి నాటు సరసం 
అందం..జింజిర్ జింజిర్ జింజిర్ జిన్


సిన్నివో సిన్నీ..ఓ..సన్నజాజుల సిన్నీ
ఓ..వన్నెగాజుల..సిన్నీ


చరణం::2 


పూతరేకుల తీయదనం..నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం..నీ పడుచుదనంలో వుందీ
పూతరేకుల తీయదనం..నీ లేత సొగసులో వుందీ
పాలమీగడ కమ్మదనం..నీ పడుచుదనంలో వుందీ


కోడెగిత్త పొగరంతా..నీ కొంటే వయసులో వుందీ
కోడెగిత్త పొగరంతా..నీ కొంటే వయసులో వుందీ

అందుకేనేమో..ఉ..అందుకేనేమో

తుర్రుమని నే నెళ్ళాలంటే 
తూరుపుదిక్కు ఆపేసింది
ఉరుమురిమి చూడాలంటే 
ఉత్తరదిక్కు ఊపేసింది
జింజిర్ జింజిర్ జింజిర్ జిన్


సిన్నివో సిన్నీ..సిన్ని ఈ సిన్ని 
నీ సన్నజాజుల సిన్ని..నీ వన్నె గాజుల సిన్ని
పున్నమి చంద్రునిలోనే..ఈ సిన్ని
వెన్నెలై విరబూస్తుందీ..ఈ సిన్ని

సిన్నివో సిన్నీ..ఓ..సన్నజాజుల సిన్నీ
ఓ వన్నెగాజుల సిన్నీ..ఆ..అహ హాహహ అహా
ఓ..ఓహోహో..హోహో ఓహో

Jeevanajyothi--1975
Music::K.V.Mahaadevan
Lyrics::D.C.Naraayanareddi
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::K.Viswanath
Cast::Sobhanbabu,Vanisree,K,Satyanarayana,Rajababu,Ramaprabha,Subha,Nirmalamma,AlluraamalingayyaMukkaamala,Baby Varalakshmii.Seetaalatha,Padmasree,Ramola.

:::::::::::::::::::::

sinnivO sinnii..O..sannajaajula sinni
sinnivO sinnii..O..sannajaajula sinni 
O...vannegaajula...sinni
turrumani nuv...veLLipOtE
toorupu dikku...aapEstundi
urumurimi...choosaavanTE
uttara dikku...oopEstundi

jinjir jinjir jinjir jin
sinnivO sinnii..O..sannajaajula sinni
O...vannegaajula..sinnii


kallaboli maaTalatO allari peDitE..nannallari peDitE
velluva gOdaarilaa kammEstaanu..ninnu kammEstaanu

gOdaari pongalle naameediki vurikostE
godaari pongalle naameediki vurikostE
raadaari paDavalle tEli tEli pOtaanu
jinjir jinjir jinjir jin^

sinnivO sinnii..O..sannajaajula sinnii
O...vannegaajula...sinnii

::::1

komma meedi chilakammaku..kulukE andam
ii kOnaseema bullemmaki..alakE andam
komma meedi chilakammaku..kulukE andam
ii kOnaseema bullemmaki..alakE andam

guTilOni gOrinkaku..chaaTu sarasam andam
guTilOni gOrinkaku..chaaTu sarasam andam
ii gunToori pilagaaniki naaTu sarasam 
andam..jinjir jinjir jinjir jin


sinnivO sinnii..O..sannajaajula sinnii
O..vannegaajula..sinnii

::::2 

pootarEkula teeyadanam..nii lEta sogasulO vundii
paalameegaDa kammadanam..nii paDuchudanamlO vundii
pootarEEkula teeyadanam..nii lEta sogasulO vundii
paalameegaDa kammadanam..nii paDuchudanamlO vundii

kODegitta pogarantaa..nii konTE vayasulO vundii
kODegitta pogarantaa..nii konTE vayasulO vundii

andukEnEmO..u..andukEnEmO

turrumani nE neLLaalanTE 
toorupudikku aapEsindi
urumurimi chooDaalanTE..EEEE 
uttaradikku oopEsindi
jinjir jinjir jinjir jin

sinnivO sinnii..sinni ii sinni 
nii sannajaajula sinni..nii vanne gaajula sinni
punnami chandrunilOnE..ii sinni
vennelai viraboostundii..ii sinni

sinnivO sinnii..O sannajaajula sinnii
O vannegaajula sinnii..aa..aha haahaha ahaa
O..OhOhO..hOhO OhO

జీవనజ్యోతి--1975




సంగీతం::K.V.,మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,రమోల 
Film Directed By::K.Viswanaath
తారాగణం::శోభన్‌బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,శుభ,నిర్మల,అల్లు రామలింగయ్య,ముక్కామల,బేబివరలక్ష్మీ,సీతాలత,పద్మశ్రీ,రమోల.  

పల్లవి::

ఎందుకంటే..ఏమి చెప్పను
ఏవిటంటే..ఎలా చెప్పను 
ఎందుకంటే..ఏమిచెప్పను
ఏవిటంటే..ఎలా చెప్పను

సద్దుమణిగిన..ఈ వేళా
మన మిద్దరమే..వున్న వేళా
సద్దుమణిగిన..ఈ వేళా
మన మిద్దరమే..వున్న వేళా
తెల్లచీర తెస్తే..మల్లెపూలు ఇస్తే
ఎందుకంటే..ఏమి చెప్పను
అందుకే అని..ఎలా చెప్పను

చరణం::1

" అబ్భా ఎప్పుడు అదే.."

మ్యావ్...మ్యావ్...

అందాల ఓ పిల్లీ..అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె..చిన్నారి సిరిమల్లి
అందాల ఓ పిల్లీ..అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె..చిన్నారి సిరిమల్లి

క్షణము దాటిందంటే..మనసు మారునో ఏమో..ఆ 
క్షణము దాటిందంటే..మనసు మారునో ఏమో
అంతగా పనివుంటే..ఆ పైన రావే..దయచేసి పోవే
మ్యావ్....మ్యావ్...

ఇంతకన్న..ఏమి చెప్పను
అందుకే అని..ఎలా చెప్పను

చరణం::2

"అబ్బా....నిద్దరొస్తుందండీ"

కొత్తగా పెళైన..కోడెవయసు జంట
కొన్నెళ్ళవరకైన..నిదురే పోరాదంట
కొత్తగా పెళైన..కోడెవయసు జంట
కొన్నెళ్ళవరకైన..నిదురే పోరాదంట

" మరి " ?

సుద్దులాడాలంట..ఆ

" మ్మ్..."

పొద్దుగడపాలంటా..ఆ

" మ్మ్..."

ముద్దులాడాలంటా..ఆ

" మ్మ్... "

మోజుతీరాలంటా..ష్..

ఇంతకన్నా..ఏమి చెప్పను
ఎందుకంటే..ఏవి చెప్పను
అందుకేయని..ఎలా చెప్పను
ఇంతకన్నా..ఏమి చెప్పను

Jeevanajyothi--1975
Music::K.V.Mahaadevan
Lyrics::D.C.Naraayanareddi
Singer's::S.P.Baalu,Ramola
Film Directed By::K.Viswanath
Cast::Sobhanbabu,Vanisree,K,Satyanarayana,Rajababu,Ramaprabha,Subha,Nirmalamma,AlluraamalingayyaMukkaamala,Baby Varalakshmii.Seetaalatha,Padmasree,Ramola.

:::::::::::::::::::::

endukanTE..Emi cheppanu
EviTanTE..elaa cheppanu 
endukanTE..Emicheppanu
EviTanTE..elaa cheppanu

saddumanigina..ii vELaa
mana middaramE..vunna vELaa
saddumanigina..ii vELaa
mana middaramE..vunna vELaa
tellacheera testE..mallepoolu istE
endukanTE..Emi cheppanu
andukE ani..elaa cheppanu

::::1

" abbhaa eppuDu adE.."

myaav...myaav...

andaala O pillii..aravakE naa tallii
ipuDipuDE karuNinche..chinnaari sirimalli
andaala O pillii..aravakE naa tallii
ipuDipuDE karuNinche..chinnaari sirimalli

kshaNamu daaTindanTE..manasu maarunO aemO..aa 
kshaNamu daaTindanTE..manasu maarunO EmO
antagaa panivunTE..aa paina raavE..dayachEsi pOvE
myaav....myaav...

intakanna..aemi cheppanu
andukae ani..elaa cheppanu

::::2

"abbaa....niddarostundanDii"

kottagaa peLaina..kODevayasu janTa
konneLLavarakaina..nidurE pOraadanTa
kottagaa peLaina..kODevayasu janTa
konneLLavarakaina..nidurE pOraadanTa

" mari " ?

suddulaaDaalanTa..aa

" mm..."

poddugaDapaalanTaa..aa

" mm..."

muddulaaDaalanTaa..aa

" mm... "

mOjuteeraalanTaa..sh..

intakannaa..Emi cheppanu
endukanTE..Evi cheppanu
andukEyani..elaa cheppanu
intakannaa..Emi cheppanu

Saturday, December 15, 2007

ఆకలిరాజ్యం--1981 రాగం::యదుకుల కాంభోజి



సంగీతం::MS.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు,S.జానకి
ప్రోడుసర్::ప్రేమలయ
డైరెక్టర్::K.బాలచందర్


రాగం::యదుకుల కాంభోజి::
( మిశ్రపహాడీ )

తన తనననతన తననన
తననననన తాన తన్న తననా
'ఒహో కన్నే పిల్లవని కన్నులున్నవని
యేన్నేన్ని వగలు పోతున్నవే చినారి
లల లల లల లలలలల
లలలల లలలల లాలల
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి
యేన్నేన్ని కలలు రపించావే పొన్నారీ

!! కన్నె పిల్లవని కన్నులున్నవని !!

యేవంటౌ..మ్మ్
సంగీతం
న న నా'మ్మ్' నువ్వైతే
రి స రి సాహిత్యం
మ్మ్ హ్మ్ హ్మ్మ్ నేనౌతా
సంగీతం నువ్వైతే
సాహిత్యం నేనౌతా

!!కన్నె పిల్లవని కన్నులున్నవని !!

న న న న న
say it once again
న న న న న
'మ్మ్మ్' స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై 'ఒకే'
తానే తానే తాన
'ఒహొ అలగా గానం గీతం కాగ
తరన తాన
కవిని నేనై
తాన ననన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా నననా తరనా
'beautiful' కవ్య మైనదీ
తలపు పలుకు మనసు...

!!కన్నె పిల్లవని కన్నులున్నవని
యేన్నేన్ని వగలు పోతున్నవే చినారి
చిన్న నవ్వు నవ్వి వన్నేలన్ని రువ్వి
యేన్నేన్ని కలలు రపించావే పొన్నారీ
సంగీతం...." ఆ..హా..హా..
నువ్వైతే...ఆ..హా..హా..
సాహిత్యం...ఆ..హా..హా...
నేనౌతా..ఆహహా....!!

ఇప్పుడు చూద్దం
తనన తనన తన్నా
'మ్మ్హ్మ్' తనన తనన అన్న
తాన తన్న తానం తరనాతన్నా
తాన అన్న తాళం ఓకటే కాదా
తననతాన తాననన తాన
'అహ అయ్యబాబోయ్'తననతాన తాననన తాన
'మ్మ్' పదము చేర్చి పాట కూర్చ లేదా
షభాష్!
దనిని దసస అన్నా
నీద అన్న స్వరమే రాగం కాదా
నీవు నేనన్నీ అన్నా మనమే కాదా
నీవు నేనన్నీ అన్నా మనమే కాదా

కన్నే పిల్లవని కన్నులున్నవని
కవిత చేప్పి మెపించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెపించేది యెప్పుడనీ
కన్నే పిల్లవని కన్నులున్నవని
కవిత చేప్పి మెపించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెపించేది యెప్పుడనీ
మ్మ్ అహ హా ల ల లా మ్మ్హ్మ్మ్మ్ అహహా
ల ల లా ల ల లా ల ల లా ల ల లా


Aakali Rajyam--1981
Music::M.S.Viswanathan
Lyricis::Aacharya Aathreya
Singer's::S.P.Balu,S.Janaki
Cast::Kamalhasan,Sreedevi,
:::

Tana tanananatana tananana 
tananananana tana tanna tanana
"oho" kanne pilavani kanulunnavani 
yennenni vagalu potunave chinari
lala lala lala lalalalala 
lalalala lalalala lalala
chinna navu navi vannelanni ruvi 
yennenni kalalu repinchave ponari
Kanne pilavani kanulunnavani 
yennenni vagalu potunave chinari
chinna navu navi vannelanni ruvi 
yennenni kalalu repinchave ponari

Yevantau m
sangeetam
na na na 'm' nuvaite
ri sa ri sahityam
m hm hm nenouta
sangeetam nuvaite sahityam nenouta
Kanne pilavani kanulunnavani 
yennenni vagalu potunave chinari
chinna navu navi vannelanni ruvi 
yennenni kalalu repinchave ponari

Na na na na na
say it once again
na na na na na
'mm' swaramu neevai
taranana tararanana
swaramuna padhamu nenai 'ok'
tane tane tana
'oho alaga' ganam geetam kaga
tarana tana
kavini nenai
tana nanana tana
nalo kavita neevai
nanananana lalala nanana tarana
'beautiful'kavyam ainadi talapu paluku manasu

Kanne pilavani kanulunnavani 
yennenni vagalu potunave chinari
chinna navu navi vannelanni ruvi 
yennenni kalalu repinchave ponari
sangeetam nuvaite sahityam nenouta

Ippudu choodam
tanana tanana tanna
'mhm' tanana tanana anna
tana tanna tannam taratatana
tana anna talam okate kada
tanananana tananana tana
'aha ai baboi' tananatana tananana tana
'm' padamu cherchi pata koorcha leda
shabash!
danini dashasha anna
needa anna swarame ragam kada
neevu nenanni anna maname kada
neevu nenanni anna maname kada

Kanne pilavani kannulunnavani 
kavita cheppi nerpinchave gadasari
chinna navu navi nuvu duvi duvi 
kalisi memu nerpinchedi yeppudanni
Kanne pilavani kannulunnavani 
kavita cheppi nerpinchave gadasari
chinna navu navi nuvu duvi duvi 
kalisi memu nerpinchedi yeppudanni
M..aha la la la mhmm ahaha

la la la..la la la..la la la..la la la

Friday, December 14, 2007

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990::శివరంజని::రాగం


























సంగీతం::ఇళయరాజరచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్రరాగం::శివరంజని

అబ్బనీ తీయని దెబ్బ
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగావున్నదే మొగ్గ
అబ్బనీ తీయని దెబ్బ
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
వయ్యరాల వెల్లువా
వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోన పుంగవా
పులకింతిస్తే ఆగవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగావున్నదే మొగ్గ

చిటపట నడుముల ఊపులో
ఒక ఇరుసున వరసలు కలువగా
ముసిరిన కసికసి వయసులో
ఒక ఎదనిస పదనిస కలువగా
కాదంటునే కలబడు
అది లేదంటునే ముడిపడు
ఏమంటున్నా మదనుడు
తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కాస్తా
వయసు నిలబడు కౌగిట
అబ్బనీ తీయని దెబ్బ
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగావున్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా
పులకింతిస్తే ఆగవా
వయ్యరాల వెల్లువా
వాటేస్తుంటే వారెవా
అబ్బనీ తీయని దెబ్బ
మ్మీ....హు....
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగావున్నదే మొగ్గ

అడగక అడిగిన దేవిటో
లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అదివిని అదిమిన సోకులో పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నైనావి పెదవులూ..అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులూ అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట
అబ్బనీ తీయని దెబ్బ
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగావున్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా
పురుషుల్లోన పుంగవా
పులకింతిస్తే ఆగవా
వయ్యరాల వెల్లువా
వాటేస్తుంటే వారెవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంతకమ్మగా వుందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ
మ్మీ....హు....
ఎంత లేతగావున్నదే మొగ్గ

జగదేకవీరుడు అతిలోకసుందరి--1990::మాయామాళవ గౌళ::రాగం























సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

రాగం::మాయామాళవ గౌళఈ రాగాన్ని "నాదనామక్రియ" అనికూడా అంటారు

యమహొ నీ యమా యమా అందం,
చెలరెగింది ఎగా దిగా తాపం
నమహొ నీ ఝమా ఝమా వాటం,
సుడి రెగింది ఎడా పెడా తాళం
పొజుల్లొ నెను యముడన్త వాన్ని,
మొజుల్లొ నీకు మొగుడంటి వాన్ని
అల్లారు ముద్దుల్లొ గాయం
విరబుసింది పువ్వంటి ప్రాయం

యమహొ నీ యమా యమా అందం,
చెలరెగింది ఎగా దిగా తాపం
నమహొ నీ ఝమా ఝమా వాటం,
సుడి రెగింది ఎడా పెడా తాళం !!

నల్లనీ కటుక పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి
గుత్తు గా సెంటే కొట్టి వడ్డనాలె ఒంటికి పెట్టి
తెల్లని చీరా కట్టి మల్లెలు చుట్టి కొప్పున బెట్టి
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారనెట్టి
చీకటింట దీపామెట్టి చీకు చింత పక్కానెట్టి
నిన్ను నాలొ దాచి పెట్టి నన్ను నీకు దొచి పెట్టి
పెట్టుకోతా వద్దెయ్ చిట్టెంకి చెయ్ పట్టిన్నాడె కుసెయ్ వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మీ నువ్ పుట్టిన్ది నా కొసం అమ్మీ
ఇక నీ సొగసు నా వయసు పేనుకొనే ప్రేమలలొ

యమహొ నీ యమా యమా అందం
చెలరెగింది ఎగా దిగా తాపం
నమహొ నీ ఝమా ఝమా వాటం
సుడి రెగింది ఎడా పెడా తాళం !!

పట్టెమంచం ఏసిపెట్టి పాలు పెట్టి పండ్లు పెట్టీ
పక్కమీదపూలుగుట్టి పక్కా పక్కా నొల్లో బెట్టి
ఆకులో వక్కా పెట్టి సున్నాలెట్టి చిలకా జుట్టీ
ముద్దుగా నోట్లో బెట్టి పరువాలన్ని పండాబెట్టి
చీరగుట్టు సారేబెట్టి సిగ్గులన్ని ఆరాబెట్టి
కళ్ళల్లోన ఒత్తులెట్టి కౌగిలింత మాటూబెట్టి
ఒట్టె పెట్టి వచ్చెసాక మావా
నిన్ను ఒళ్ళోపెట్టి లాలించేదే ప్రేమా
పెట్తెయి సందె సీకట్లోనా నను కట్టేయి కౌగిలింతలోన
ఇక ఆ గొడవా ఈ చొరవా ఆగవులే అలజడిలో

యమహొ నీ యమా యమా అందం,
చెలరెగింది ఎగా దిగా తాపం
నమహొ నీ ఝమా ఝమా వాటం,
సుడి రెగింది ఎడా పెడా తాళం
పొజుల్లొ నెను యముడన్త వాన్ని
మొజుల్లొ నీకు మొగుడంటి వాన్ని
అల్లారు ముద్దుల్లొ గాయం
విరబుసింది పువ్వంటి ప్రాయం
యమహొ నీ యమా యమా అందం,
చెలరెగింది ఎగా దిగా తాపం !!