సంగీతం::కుమార్
రచన::రాజశ్రీ
గానం::V.రామక్రిష్ణ
తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి
రాధా...
రాధా...
రాధా...
పులకింతరాధా
ఎవరికైన పులకింతరాధా
అందాలు కనువిందు చేస్తుంటే
నీ అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా
చూసే కనులకు నోరుంటే...
అది మధురగీతమే పాడగా
మధురగీతమే పాడగా
అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా !!
చల్లగాలుల పల్లకీలలో
నల్ల బమ్ములు రేగేనూ
అంబరాన ఆ సంబరాలుగని
గిరులబారులే మురిసెనూ
పలుకురాని ప్రకౄతి నాకు
పలికె స్వాగతాలూ
నిండుగా కలలు పండగా
నాదుడెందమే నిండగా
అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా
ఎవరి కురులలో నలుపు చూసి
తుమెదలు చిన్నబోయేనూ
ఎవరి బుగ్గలా ఎరుపు చూసి
చెంగెలువ సిగ్గు చెందేనూ
అవే సోయగాల కురులు
అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగా మనసు చెదరగా
కనులకెదురుగా వెలిసెనూ
అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా
ఈ సరస్సులో ఇంద్రధనస్సులో
వింత సొగసు ఏముందీ
ఓరచూపులా సోగ కనులలో
కోటి సొగసులా గనివుందీ
చెలియ పాల నవ్వులోన
మరులజల్లువానా
కురిసెనే వలపు విరిసెనే
తలపు చిందులే వేసేనే
అందాలు కనువిందు చేస్తుంటే
ఎదలోన పులకింత రాదా
చూసే కనులకు నోరుంటే...
అది మధురగీతమే పాడగా
మధురగీతమే పాడగా
No comments:
Post a Comment