Monday, December 17, 2007

వీరాభిమన్యు --1965




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన,S.వరలక్ష్మి,G.వరలక్ష్మి,పద్మనాభం,రాజనాల,నెల్లూరు కాంతారావు,దండమూడి రాజగోపాల్,ధూళిపాళ,K.సత్యనారాయణ,గీతాంజలి.

పల్లవి::

ఆ...ఆ..ఆ..
అహా..ఆహా..హా

ఓహో...ఒహొ...
అదిగో నవలోకం
వెలసే మనకోసం

అదిగో నవలోకం..వెలసే మనకోసం
అదిగో నవలోకం..వెలసే మనకోసం

చరణం::1


నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో
ఎచట సుధ కలదో
అచటె మనముందామా..ఆ..ఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం

చరణం::2


పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఫలించె కోటి మురిపాలూ ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఎచట హృదయాలూ
ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా..ఆ..ఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం
అదిగో నవలోకం..వెలసే మనకోసం

No comments: