Tuesday, August 28, 2007

మర్మయోగి--1963::యదుకుల కాంభోజి::రాగం



సంగీతం: ఘంటసాల
రచన: ఆరుద్ర
గానం: ఘంటసాల,లీల


రాగం::యదుకుల కాంభోజి

పహడి హిందుస్తాని (యదుకుల కాంభోజి)

ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..

నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

అనుకోని సుఖము పిలిచేను
అనురాగ మధువు వొలికేను (2)
కొనగోటితో నిను తాకితే
పులకించవలయు ఈ మేను

!! నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే
!!
నిదురించవోయి వడిలోన
నిను వలచెనోయి నెరజాణ
(2)అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిమిషాన

!! నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి
ఆహాహ...హాహా...ఒహొహోహో... !!

Sunday, August 26, 2007

జయభేరి--1959::విజయానందచంద్రిక::రాగం






సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::మల్లాది రామకృష్ణశాస్ర్తి
గానం::ఘంటసాల


విజయానందచంద్రిక::రాగం

(ఈ రాగం కూర్చినది పెండ్యాల నాగేశ్వరరావ్
పేరుపెట్టినది మల్లాది రామకృష్ణశాస్త్రి
ఆరోహణం..చక్రవాకం..అవరోహణం..బహార్ ) 

పల్లవి::

ఆ...ఆ...ఆ.....
రసికరాజ తగువారము కామా...
సికరాజ తగువారము కామా...
ఆ...ఆ...ఆ...అఅఅ...ఆ....
రసికరాజ తగువారము కామా...

అనుపల్లవి::

అగడుసేయ తగవా....ఆ....
ఏలుదొరవు అరమరికలు ఏలా
ఏలవేల సరసాల సురసాల...
ఏలుదొరవు అరమరికలు ఏలా
ఏలవేల సరసాల సురసాల...
ఏలుదొరా...ఆ...ఆ...ఆ.....

చరణం::1

నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి
నిన్ను తలచి...పా...దపమగరిసా...నిన్ను తలచి

దనిపా నిదసనిపమగరిసరిసా
నిదనిసా నిదనిసమగమ పమగమ దని సనిపా
మగమదా దనిసరి సరిమగామరిస నిసరిసా నిదనిసా నిపమపా
మగరిసా... నిన్ను తలచి...
దనిద దనిద దనిదనిదస నిపమప గా మా పా
దనిస నిప మప గా మా దా
నిరిస నిపగమ దానీసా

గమరి సరిసా సరిసనిసనీ నిసని దనిదా నిసని పనిపా
మగమ దని సారిసా నిసనీ పనిపా మపమా నిసనీ పనిపా మపమా గమగా
రిగరిసరిసనిస సరిసనిసనిదని నిసనిపనిపమప సనిపమగరిస...
సససస సససస సనిదని సనిసస సనిదని సనిదని
సనిసమ గరిసని సనిసప మగరిస సనిసని పమగరి
నినిని నినినినిని నినిని నినినినిని దదద దదదదద దదద దదదదద
దదని దదని దదని దనిదని దదని దదని దదని దానిదాని

సనిసమ గమపమ గమనిదనీపా
గగగ మమమ దదద నినిని రిరిరి గగగ మమమ రిరిరి సనిసా
గారీసాని దానీసా గరిసనిద నీసా రీసానీద నీసానిరీ
రిసనిదనిసానీ గామాద మాదాని దానీసరీ గారీ సానీద
రీసానీదామగామాదానీపా
గామాదనిస రీసారిసరి రీపామగమరీ
గరిసనిద రిసనిపమ గమదనిసా
రిసనిదని సనిపమప మగమదని
సనిపమప దనిపమగ పమగరిస

నిన్ను తలచి గుణగానము చేసి
దివ్యనామ మధుపానము చేసి
సారసాక్ష మనసా వచసా... ఆ...
నీ సరస జేరగనే సదా వేదనా...
ఏలుదొరవు అరమరికలు ఏలా
ఏలవేల సరసాల సురసాల...
ఏలుదొరా... ఆ.....

Friday, August 24, 2007

ఆత్మబంధువు--1962



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

!! చదువు రాని వాడవని దిగులు చెందకు !!

యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

!! చదువు రాని వాడవని దిగులు చెందకు !!

తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మ అని
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

!! చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు !!

ఆత్మబంధువు--1962



రచన::ఆత్రేయ
సంగీతం::మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను
కంటిపాప కంటె యెంతో గారవించేను
కంటిపాప కంటె యెంతో గారవించేను
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగేను తానుండసాగేను

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా కుక్క మేలురా

!! అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి !!

Thursday, August 23, 2007

రుద్ర వీణ--1988::రాగం::కీరవాణి

రాగం::కీరవాణి !!
సంగీతం: ఇళయరాజా
గానం::SP.బాలసుబ్రమణ్యం,మనో,S.జానకి,SP.శైలజ
rachana::రచన::వేటూరి

పి.ఎల్ : రండి రండి రండి..దయ చేయండీ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ

రండి రండి రండి దయ చేయండీ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ

శోభన: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు
!!
చిరు: అహా !
శోభన: అఁ ! ఇష్ఠులైన వారొస్తే పట్టలేని హుషారు.
పలకరింపుతోనే మనసు మీట గలరు.
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరూ.

పి.ఎల్ : తమరేనా సూర్య. ఇలా కూర్చోండయ్యా
!!
ఆగండాగండాగండి. వద్దు కూర్చోకండక్కడ!!
తగిన చోటు కాదది తమబోటివారికిక్కడ.

శోభన: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య.
గడపదాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య.

పి.ఎల్ : క్లైంట్లు, కంప్లైంట్లూ..
క్లైంట్లు, కంప్లైంట్లూ మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గానకళకు దర్బారు.

పి.ఎల్ : రండి రండి రండి..దయ చేయండీ
శోభన: తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ

పి.ఎల్ : బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రు మంటూ
బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రు మంటూ చిర్రు బుర్రు లాడటం కుర్చీలకు ఆచారం.
ఆత్మీయులు వచ్చినపుడు ఆ చప్పుడు అపచారం.
వచ్చిన మితృలకోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా !!

కచేరీలు చేసే కుర్చీ ఇది. ఎలా ఉంది
?

చిరు: హుఁ , బాగుందండి
!!

పి.ఎల్ : గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంటా..
శునకమైనా పలుకు కనకాంగి రాగాన
!
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా..
గాలైన కదలాడు సరిగమల త్రోవా..

పి.ఎల్ : రావోయ్ రా ! ఇదుగో ఈయనే సూర్య ! " ఈమె నా భార్య "!
ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సూ..
ఆర్గ్యుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సూ..

పి.ఎల్ భార్య : చాల్లేండి సరసం ! యేళ్ళు ముదురుతున్న కొద్దీ..

పి.ఎల్ : తిడితే తిట్టేవు కాని తాళంలో తిట్టూ..
తకతోం తకతోం తరిగిటతోం థక తకిటతోం !!
స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.

పి.ఎల్ భార్య : తడతా పెడతా పొగపెడతా ఉడకపెడతా
!!
కొత్తవాళ్ళ ముందేవిటి వేళాకోళం ! ఎవరేమనుకుంటారో తెలియని మేళం
!!

శోభన: ఎవరో పరాయివారు కాదమ్మా ఈయనా
!!
సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన !!

పి.ఎల్ భార్య : ఆహఁ ! రండి రండి రండి..దయ చేయండీ
అందరూ : తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ

పి.ఎల్ నాన్న: ఖళ్ ఖళ్ ఖళ్ ఖళ్
!

పి.ఎల్ : వ్రుద్దాప్యంతో మంచం పట్టి తాళం తప్పక దగ్గటమన్నది
అంచెలంచలుగ సాధించిన మా తండ్రి పెంచలయ్యా
!!
ఖళ్ళూ ఖళ్ళున వచ్చే చప్పుడు..
ఘల్లూ ఘల్లున మార్చే విద్యా..
కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్యా
!!

శోభన: ఇదుగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవీ
!!
పి.ఎల్ : దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం
!!
మా ఇంట్లో సందడికీ ఈ పిల్లే పల్లవి.

పనమ్మాయి : రండి రండి రండి దయ చేయండీ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ

డింగ్ డింగ్..డింగ్ డింగ్ (డోర్ బెల్)

పోస్ట్మాన్ : పోస్ట్ పోస్ట్ ! పోస్ట్ పోస్ట్
!!
వావిలాల వరాలయ్య బి.అ.ఎల్.ఎల్.బి పోస్ట్ పోస్ట్ ! పోస్ట్ పోస్ట్
!!

పి.ఎల్ : మాఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లూ
అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లూ
!!

చిలుక: రండి రండి రండి..రండి రండి రండి !!

శోభన: మాకు నిలయ విద్వాంసులు చిలకరాజు గారూ..
కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరూ..

పి.ఎల్ : నవ్వు మువ్వ కట్టీ..ప్రతి నిముషాన్నీ తుళ్ళిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగూ మళ్ళిస్తూ
ఇదే మాదిరి సుధామాధురి పంచడమే పరమార్ధం !!
అదే అదే నా సిద్దాంతం
! !

చిరు: గానం అంటే ఒక కళగానే తెలుసిన్నాళ్ళూ నాకూ..
బ్రతుకే పాటగ మార్చినందుకూ జోహారిదిగో మీకూ..
సంగీతంతో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళూ..
సంగీతంలో మాటలాడటం .. దా దా పదా పదా పదా !!
మాటలనే సంగతులు చేయటం పనీ..పని పని సరి..పని సరిగా
!!
సంగతులే సద్గతులనుకొనడం సరి
సరి సరి సరి సరి సరిగా సరిగ సరిగా తెలుసుకొన్నాను ఈనాడూ

సెలవిప్పిస్తే వెళ్ళొస్తా..
మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా..ఆ ! హా
!

రుద్ర వీణ--1988::లలిత::రాగం





















సంగీతం::ఇళయరాజ
గానం::KJ.జేస్‌దాస్,KS.చిత్ర

రాగం:::లలిత

లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియా కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ......
ఉదయ రవికిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ.....
ఉదయ రవికిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ.......
అమౄత కలశముగా ప్రతినిమిషం
అమౄత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది

!! లలిత ప్రియ కమలం !!


రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నెల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హౄదయం
కలల విరుల వనం మన హౄదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి
రాగ చరితర గలమౄదురవళి
తూగుతున్నది మరులవనీ
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను

!! లలిత ప్రియా కమలం !!


కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము
వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది
ఊహల జగతిని ఆ.....ఆ..
లలిత ప్రియా కమలం విరిసినది
కన్నుల కొలనిది ఆ......

!! లలిత ప్రియా కమలం !!

Wednesday, August 22, 2007

తోడి కోడళ్ళు--1957


సంగీతం::మాష్టర్ వేణు
రచన::కోసరాజు
గానం::ఘటసాల,P.సుశీల

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు తోడేస్తుంటే
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు తోడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటె నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది …

ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది


తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి ..
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది
నునుసిగ్గుముంచుకొస్తున్నది....
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది


చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
తీయని తలపులు నాలో ఏమో...
తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తు ఉన్నవి
ఆహ తికమక చేస్తు ఉన్నవి ....
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది



మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది …ఆఆఆఆఆఆ…ఆఆఆఆఆఆఆ
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది

తోడి కోడళ్ళు--1957


సంగీతం::మాస్టర్ వేణు
రచన::కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘంటసాల,జిక్కి

'మూటా ముల్లె కట్టూ..'
'ఎక్కడికీ ?'
' బస్తీకి !'

తింటానికి కూడు చాలదే జాంగిరీ..ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాము పైసా తెద్దామే..రావే నా రంగసాని

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ..డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో రబ్బీ బంగారు సామి


రెక్కలన్నీ ఇరుచుకుంట..రిక్షాలు లాక్కుంట
రెక్కలన్నీ ఇరుచుకుంట..రిక్షాలు లాక్కుంట
చిల్లరంత చేర్చుకుంట..సినీమాలు చూసుకుంట

షికార్లు కొడదామే పిల్లా..జలసా చేద్దామే
బస్తీకి పోదాము పైసా తెద్దామే..రావే నా రంగసాని

కూలి దొరకదు నాలి దొరకదు..గొంతు తడుపుకొన నీరు దొరకదు
కూలి దొరకదు నాలి దొరకదు..గొంతు తడుపుకొన నీరు దొరకదు
రేయి పగలు రిక్షా లాగిన అద్దెకుపోను అణా మిగలదు
గడప గడపకూ కడుపు పట్టుకొని ఆకలాకలని అంగలార్చితే
చేతులు ఎత్తి కొట్టొస్తారు..కుక్కలనీ ఉసిగొల్పిస్తారు

'చాల్లెహే..'

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ..డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

ఫాక్టరీలలో పని సులువంట..గంటైపోతే ఇంటో ఉంటా
వారం వారం బట్వాడంట..ఒరే అరే అన వీల్లేదంట
కాఫీతోటే బతకొచ్చంట..కబుర్లు చెప్పుకు గడపొచ్చంట

'అట్టాగా...'

చూడ చిత్రమంటా..పిల్లా చోద్యమవుతదంటా
బస్తీకి పోదాము పైసా తెద్దామే..రావే నా రంగసాని

పిప్పై పోయే పిచ్చి ఖర్చులు..పోకిరి మూకల సావాసాలు
పిప్పై పోయే పిచ్చి ఖర్చులు..పోకిరి మూకల సావాసాలు
చీట్లపేకలు..సిగ సిగ పట్లు..తాగుడు వాగుడు తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు దోమలు..ఇరుకు సందులో మురుగు వాసనలు
అంటురోగము తగిలి చచ్చినా అవతలికీడ్చే దిక్కే ఉండదు

'అయ్యబాబోయ్ !'

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ..డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో డౌనైపోతావో రబ్బీ బంగారు సామి


ఏలి కేస్తెను కాలికేస్తవు..ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏలి కేస్తెను కాలికేస్తవు..ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏదారంటే గోదారంటవ్..ఇరుకున పెట్టి కొరుక్కు తింటవ్
దిక్కు తోచనీయవే పిల్లా..తిక మక చేసేవే

బస్తీకి నేబోను..నీతో ఉంటానే రాణి నా రంగసానీ !

గొడ్డూ గోదా మేపుకుందాం .. కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరా నారా జరుపుకుందాం .. పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూసుకుందాం .. తలో గంజియో తాగి పడుందాం

టౌను పక్కకెళ్ళొద్దండోయ్ బాబూ..డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరో డౌనైపోతారూ..
తానే తందన్న తాన.. తందన్న తాన.. తందన్న తానా!

తోడి కోడళ్ళు--1957





సంగీతం::మాష్టర్ వేణు
రచన::కోసరాజు
గానం::జిక్కి,మాధవపెద్ది

పల్లవి::

నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ

ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..

నీవు చూసే చూపులకు వన్నెలాడీ
నీరుగారి పోతానె చిన్నెలాడి
మనసు దాచుకోలేను నవనీతమ్మ
పది మాటలైన చెప్పలేను ముద్దులగుమ్మా

నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆఉహు...ఆఉహు..
ఆఉహు...ఆఉహు..

చరణం::1

ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ
మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాటవరసకైన నువ్వు రమణయ్ మావా

ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..

నీ తోటి సరసమాడి పడుచు పిల్లా
నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా
నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా

నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ

చరణం::2

నెల్లూరు పోతేను నీటుగాడా
తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా
పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ
నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ

ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
ఆఉహు...ఆఉహు..ఆఉహు...ఆఉహు..

నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆఉహు...ఆఉహు.. ఆఉహు...ఆఉహు..

తోడి కోడళ్ళు--1957


సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల
డైరెక్టర్:: అదూర్తి సుబ్బారావ్

రాగం::

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చనో చెప్పగలవా?

నిన్ను మించిన కన్నెలెందరో మందుటెఒడలో మాడిపొతే,
వారి బుగ్గల నిగ్గు నీకూ వచ్చి చేరెను, తెలుసుకో..
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడ కట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?

కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ, ఘనులూ తొలచీ,
చెమట చలువను చేర్చి రాళ్ళను, తీర్చినారూ, తెలుసుకో..

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు

గాలిలోనా తేలిపోయె చీర కట్టిన చిన్నదాన
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?

చిరుగు పాతల, బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ..
చాకిరొకరిదీ ,సౌఖ్యమొకరిదీ సాగదింకా, తెలుసుకో...

కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు