సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::ఆశాలత కులకర్ణి
తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి , గుమ్మడి , శోభన్‌బాబు , పద్మనాభం , ఇ.వి. సరోజ
పల్లవి:
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఎందుకు కలలో..కలవరింత
ఎవరిని తలచి..పలవరింత
ఎదుటకురాగా..ఏల ఈ మగత
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం::1
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి..ముచ్చట
ముందు జరుగుట..చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా..కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం..ఇంక చాలండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం::2
యువతులు దగ్గర చేరినచో..యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే..కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే..కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ..నటన మానండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం::3
నేనే వలచి రానిచో..చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి..బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే..ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే..ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు..ఇంక క్లోజండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,ఆశాలత కులకర్ణి
తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి,గుమ్మడి, శోభన్‌బాబు, పద్మనాభం, ఇ.వి. సరోజ
పల్లవి:::
ఆఅ ఆఅ ఆఅ హా..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఆఅ ఆఅ ఆఅ హా..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓహొ చక్కని చిన్నది..వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో..నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది..నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు..లేనే లేరన్నది
చరణం::1
వెచ్చగ జవ్వని తాకితే..పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన..ప్రేమ నిండేనే
అయ్యో పాపం..తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి..పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు..ముళ్ళ బాణాలు
ఓహొ చక్కని చిన్నది..వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో..నన్నే చూడన్నది
చరణం::2
పెద్దల అనుమతి..తీసుకో
ప్రేమను సొంతం..చేసుకో
హద్దుపద్దు మీరినా..ఆటకట్టేను
యస్! అంటారు..మావాళ్ళు
నో! అంటేను..జతరారు
తల్లి తండ్రి కూడంటే..గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా..దారి చూపావు
చిన్నది చాలా మంచిది..నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు..లేనే లేరన్నది
చరణం::3
మనసే దోచిన సుందరి..మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు..మరచి పరవశించాలి
అపుడే కాదు..ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు..అందరిముందు వేయగానే
తోడు నీడై కలకాలం..సాగిపోదాము
ఓహొ చక్కని చిన్నది..వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో..నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది..నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు..లేనే లేరన్నదీ
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్
ఓఓ ఓఓ ఓఓ హోయ్..ఓఓ ఓఓ ఓఓ హోయ్