సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::ఆశాలత కులకర్ణి
తారాగణం::ANR , సావిత్రి , కృష్ణకుమారి , గుమ్మడి , శోభన్‌బాబు , పద్మనాభం , ఇ.వి. సరోజ
పల్లవి:
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఎందుకు కలలో..కలవరింత
ఎవరిని తలచి..పలవరింత
ఎదుటకురాగా..ఏల ఈ మగత
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం::1
ప్రేయసి నిద్దుర లేపుట..మోము చూపుట
పెళ్ళికి తదుపరి..ముచ్చట
ముందు జరుగుట..చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా..కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం..ఇంక చాలండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం::2
యువతులు దగ్గర చేరినచో..యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే..కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే..కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ..నటన మానండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
చరణం::3
నేనే వలచి రానిచో..చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి..బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే..ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే..ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు..ఇంక క్లోజండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
ఏమండోయ్..నిదుర లేవండోయ్
No comments:
Post a Comment