సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
Cast::Venkatesh,Revati.
పల్లవి::
ప్రియతమా..నా హృదయమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే ప్రతి..రూపమా
ప్రేమకే ప్రతి..రూపమా
నా గుండెలో..నిండినా గానమా
నను మనిషిగా..చేసినా త్యాగమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే ప్రతి..రూపమా
చరణం::1
శిలలాంటి నాకు..జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు..కళ తోటి నింపి
వలపన్న తీపి..తొలిసారి చూపి
యదలోని సెగలు..అడుగంట మాపి
తులి వెచ్చనైనా..ఓదార్పు నీవై
శృతిలయ లాగా..జత చేరినావు
నువ్వు లేని నన్ను..ఊహించలేను
నా వేదనంతా..నివేదించలేను
అమరం..అఖిలం..మన ప్రేమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే..ప్రతి రూపమా
చరణం::2
నీ పెదవి పైనా..వెలుగారనీకు
నీ కనులలోనా..తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే..మున్నీరు నాకు
అది వెల్లువల్లె..నను ముంచనీకు
ఏ కారు మబ్బు..ఎటు కమ్ముకున్నా
మహాసాగరాలే..నిను మింగుతున్నా
ఈ జన్మలోనా..ఎడబాటు లేదు
పది జన్మలైనా..ముడే వీడిపోదు
అమరం..అఖిలం..మన ప్రేమా
ప్రియతమా..నా హృదయమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే..ప్రతి రూపమా
ప్రేమకే..ప్రతి రూపమా
నా గుండెలో..నిండినా గానమా
నను మనిషిగా..చేసినా త్యాగమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే.ప్రతి రూపమా
ప్రియతమా..నా హృదయమా
ప్రేమకే..ప్రతి రూపమా
No comments:
Post a Comment