VIDEO
సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల ,S.P.బాలు
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,చంద్రమోహన్,గుమ్మడి,జగ్గయ్య,కాంతారావు
పల్లవి::
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
ఆ తొట్టిలో ఉన్నాడు..జగమొండి
వాడి దూకుడికి..ఆగలేరు తప్పుకోండి
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
చరణం::1
వయసులోనే ఉన్నది..దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది..పక్కనున్నది
వయసులోనే ఉన్నది..దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది..పక్కనున్నది
చిన్నదాని చేతిలో..చిరతలున్నవి
ఎంత చెలరేగినా..నీకు హద్దులున్నవి
చిన్నదాని చేతిలో..చిరతలున్నవి
ఎంత చెలరేగినా..నీకు హద్దులున్నవి
హద్దులన్ని సద్దులేని..ముద్దులతో చెరిగిపోతవి
తందనా..తనానాన..తందనాన
తందనా..తనానాన..తందనాన
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
చరణం::2
ఎగిరెగిరిపడుతున్న..కోడెగిత్తలు
అది ఏనాడు మోయలి..మోపెడంతలు
ఎగిరెగిరిపడుతున్న..కోడెగిత్తలు
అది ఏనాడు మోయలి..మోపెడంతలు
ఎత్తుపల్లం చూస్తేనే..ఇన్నిగంతులు
మనది మెత్తనైన..దారైతే ఏల పంతాలు
ఎత్తుపల్లం చూస్తేనే..ఇన్నిగంతులు
మనది మెత్తనైన..దారైతే ఏల పంతాలు
పగాలు లేనినాడు..పంతాలు గెలవలేవూ
దసరిగరిసనిద దదద..సనిసరిసని దప పపప
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
చరణం::3
పచ్చని వరిచేను..పరువంలో ఉన్నది
పైరగాలి తగలగానే..పులకరించుచున్నది
పచ్చని వరిచేను..పరువంలో ఉన్నది
పైరగాలి తగలగానే..పులకరించుచున్నది
పులక పులకలో..వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని..కలలు గంటున్నది
పులక పులకలో..వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని..కలలు గంటున్నది
సంకురాత్రి పండుగకే సంబరాలు కాసుకున్నవి..హోయ్
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
సంగీతం::K.V.మహదేవన్
రచన::మోదుకూరి జాన్సన్
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,చంద్రమోహన్,గుమ్మడి,జగ్గయ్య,కాంతారావు
పల్లవి::
మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి
చరణం::1
రైతు లేనిదే..రాజ్యం లేదని
రైతు లేనిదే..రాజ్యం లేదని
ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే
నీలాకాశం నుదుటిన తిలకం
నిండుగ దిద్దుకుంటుంది
రైతు పాదమే..రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే
హే..హే..ఆ..ఆ..ఆ
రైతు పాదమే..రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే
అణువు అణువు అన్నపూర్ణై
ప్రేమతో పులకరిస్తుంది
మమతల మాగాణి..మనజననీ
మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి..మనజన్మ భూమి
చరణం::2
నాగలితో నమస్కరించి..పారలతో ప్రణమిల్లి
నాగలితో నమస్కరించి..పారలతో ప్రణమిల్లి
భూమి గుప్పెట పట్టి..గుప్పెడు ధాన్యం చల్లితే
గంగ యమున గోదావరి కృష్ణలై
పాలపొంగులై ప్రవహించి
కుప్పతెప్పలుగా పురులు పొర్లగా
ప్రాణం పంటగా ప్రసవించే..జననీ
పచ్చి బాలింతరాలు..మన జననీ
మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి..మనజన్మ భూమి
చరణం::3
నల్లని రాముని..అల్లరి కృష్టుణి
నల్లని రాముని..అల్లరి కృష్టుణి..పాదాలతో
చల్లబడిన నల్లరేగడి భూమి
బోసు..భగత్ సింగ్..బాపు..నెహ్రు..త్యాగాలతో
ఊపిరి పీల్చిన భూమి
అల్లూరి సీతారామరాజు రక్తంతో..వీర రక్తంతో
తడిచి తరించి..రత్నగర్భగా
రాళ్ళకెక్కిన జనని..రతనాలకన్న జననీ
భాష ఏదైనా..వేషమేదైనా
భారతీయులు ఒకటేననుచు
బిడ్డలందరికి ఒకే బావుటా
నీడగ ఇచ్చిన..జననీ
విశ్వ నివాళులందిన..జననీ
మాతకు మాత..మన భరతమాత
మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో పసిడిరాశులతో
కళ కళలాడే జననీ
మన జన్మభూమి..మన జన్మభూమి
సంగీతం:::K.V. మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల బృందం
::::
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
ముద్దు గుమ్మా పట్నం బొమ్మ వడ్డిద్దాం వేడట్లోయ్
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
చరణం::1
అమ్మని కొబ్బెర నీళ్ళలో..కల్తి చేసే దెందుకో
కైపున ముణిగేదెందుకో
చిగురాకంటి పెదవులలో..పొగతో మాడ్చేదెందుకు
కోతలు తెచ్చేదెందుకూ
అమ్మని కొబ్బెర నీళ్ళలో..కల్తి చేసే దెందుకో
కైపున ముణిగేదెందుకో
చిగురాకంటి పెదవులలో..పొగతో మాడ్చేదెందుకు
కోతలు తెచ్చేదెందుకూ
ఆ గాలీ వెలుగు నీరూ..కావలసినంత కైపెక్కిస్తాయ్
పాలు వెన్న మీగడలో..పడుచుదనానికి వన్నెలు తెస్తాయ్
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
ముద్దు గుమ్మా పట్నం బొమ్మ వడ్డిద్దాం వేడట్లోయ్
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
చరణం::2
బట్టలు వేసేదెందుకూ..వంటిని కప్పేటందుకు
కంటికి నచ్చేటందుకు..
బట్టబయలుగా బయటకొచ్చేవీ బట్టలు కాలేవూ
పట్టుకులాగేమూ
బట్టలు వేసేదెందుకూ..వంటిని కప్పేటందుకు
కంటికి నచ్చేటందుకు..
బట్టబయలుగా బయటకొచ్చేవీ బట్టలు కాలేవూ
పట్టుకులాగేమూ
పిడికిలి మూసిపట్టినప్పుడె..పెట్టో గుట్టో ఉంటాయి
అగుపడి అగుపడి కున్నప్పుడే..అందానికి అందం వచ్చేదీ
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
ముద్దు గుమ్మా పట్నం బొమ్మ వడ్డిద్దాం వేడట్లోయ్
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
చరణం::3
కట్టు బొట్టు జుట్టూ..పుట్టక తెలిపేదీ
పెట్టని నగలే అవి..
హద్దు పద్దు అణుకువలో..విద్యను మించేవీ
బుద్ధులు పెంచేవి
కట్టు బొట్టు జుట్టూ..పుట్టక తెలిపేదీ
పెట్టని నగలే అవి..
హద్దు పద్దు అణుకువలో..విద్యను మించేవీ
బుద్ధులు పెంచేవి
చేతికి పెట్టు గోరింటాకు..కళ్ళకు దిద్దు కాటుక రెఖా
తెలుగు తనాన్ని పుణికి పుచ్చుకో..తెలుగు పిల్లగా పేరు తెచ్చుకో
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
ముద్దు గుమ్మా పట్నం బొమ్మ వడ్డిద్దాం వేడట్లోయ్
అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పు మూరట్లోయ్
Paadi Pantalu--1976
Music::K.V.Mahaadevan
Lyrics::Atreya
Singer's::P.Suseela,Brundam
:::
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
muddu gummaa paTnam bomma vaDDiddaam vEDaTlOy
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
:::1
ammani kobbera neeLLalO..kalti chEsE dendukO
kaipuna muNigEdendukO
chiguraakanTi pedavulalO..pogatO maaDchEdenduku
kOtalu techchEdendukU
ammani kobbera neeLLalO..kalti chEsE dendukO
kaipuna muNigEdendukO
chiguraakanTi pedavulalO..pogatO maaDchEdenduku
kOtalu techchEdendukU
aa gaalii velugu neeruu..kaavalasinanta kaipekkistaay
paalu venna meegaDalO..paDuchudanaaniki vannelu testaay
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
muddu gummaa paTnam bomma vaDDiddaam vEDaTlOy
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
:::2
baTTalu vEsEdendukoo..vanTini kappETanduku
kanTiki nachchETanduku..
baTTabayalugaa bayaTakochchEvii baTTalu kaalEvU
paTTukulaagEmoo
baTTalu vEsEdendukoo..vanTini kappETanduku
kanTiki nachchETanduku..
baTTabayalugaa bayaTakochchEvii baTTalu kaalEvU
paTTukulaagEmoo
piDikili moosipaTTinappuDe..peTTO guTTO unTaayi
agupaDi agupaDi kunnappuDE..andaaniki andam vachchEdii
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
muddu gummaa paTnam bomma vaDDiddaam vEDaTlOy
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
:::3
kaTTu boTTu juTTuu..puTTaka telipEdii
peTTani nagalE avi..
haddu paddu aNukuvalO..vidyanu minchEvii
buddhulu penchEvi
kaTTu boTTu juTTuu..puTTaka telipEdii
peTTani nagalE avi..
haddu paddu aNukuvalO..vidyanu minchEvii
buddhulu penchEvi
chEtiki peTTu gOrinTaaku..kaLLaku diddu kaaTuka rekhaa
telugu tanaanni puNiki puchchukO..telugu pillagaa pEru techchukO
aTlataddi AraTlOy muddapappu mooraTlOy
muddu gummaa paTnam bomma vaDDiddaam vEDaTlOy
aTlataddi AraTlOy muddapappu mooraTlOy