Wednesday, March 19, 2014

పాడిపంటలు--1976






















సంగీతం::K.V.మహదేవన్
రచన::మోదుకూరి జాన్సన్
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,చంద్రమోహన్,గుమ్మడి,జగ్గయ్య,కాంతారావు

పల్లవి::

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి

చరణం::1

రైతు లేనిదే..రాజ్యం లేదని
రైతు లేనిదే..రాజ్యం లేదని
ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే
నీలాకాశం నుదుటిన తిలకం
నిండుగ దిద్దుకుంటుంది

రైతు పాదమే..రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే
హే..హే..ఆ..ఆ..ఆ
రైతు పాదమే..రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే
అణువు అణువు అన్నపూర్ణై
ప్రేమతో పులకరిస్తుంది
మమతల మాగాణి..మనజననీ

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి..మనజన్మ భూమి

చరణం::2

నాగలితో నమస్కరించి..పారలతో ప్రణమిల్లి
నాగలితో నమస్కరించి..పారలతో ప్రణమిల్లి
భూమి గుప్పెట పట్టి..గుప్పెడు ధాన్యం చల్లితే
గంగ యమున గోదావరి కృష్ణలై
పాలపొంగులై ప్రవహించి
కుప్పతెప్పలుగా పురులు పొర్లగా
ప్రాణం పంటగా ప్రసవించే..జననీ
పచ్చి బాలింతరాలు..మన జననీ

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో..పసిడి రాశులతో
కళ కళలాడే జననీ..మన జన్మభూమి
మనజన్మ భూమి..మనజన్మ భూమి

చరణం::3

నల్లని రాముని..అల్లరి కృష్టుణి
నల్లని రాముని..అల్లరి కృష్టుణి..పాదాలతో
చల్లబడిన నల్లరేగడి భూమి
బోసు..భగత్ సింగ్..బాపు..నెహ్రు..త్యాగాలతో
ఊపిరి పీల్చిన భూమి

అల్లూరి సీతారామరాజు రక్తంతో..వీర రక్తంతో
తడిచి తరించి..రత్నగర్భగా
రాళ్ళకెక్కిన జనని..రతనాలకన్న జననీ

భాష ఏదైనా..వేషమేదైనా
భారతీయులు ఒకటేననుచు
బిడ్డలందరికి ఒకే బావుటా
నీడగ ఇచ్చిన..జననీ
విశ్వ నివాళులందిన..జననీ
మాతకు మాత..మన భరతమాత

మన జన్మభూమి..బంగారు భూమి
పాడి పంటలతో పసిడిరాశులతో
కళ కళలాడే జననీ
మన జన్మభూమి..మన జన్మభూమి

     

No comments: