Saturday, May 31, 2014

పాడి పంటలు--1976



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ   
గానం::P.సుశీల ,S.P.బాలు
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,చంద్రమోహన్,గుమ్మడి,జగ్గయ్య,కాంతారావు

పల్లవి::

ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి
ఆ తొట్టిలో ఉన్నాడు..జగమొండి
వాడి దూకుడికి..ఆగలేరు తప్పుకోండి
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి

చరణం::1

వయసులోనే ఉన్నది..దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది..పక్కనున్నది
వయసులోనే ఉన్నది..దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది..పక్కనున్నది
చిన్నదాని చేతిలో..చిరతలున్నవి
ఎంత చెలరేగినా..నీకు హద్దులున్నవి
చిన్నదాని చేతిలో..చిరతలున్నవి
ఎంత చెలరేగినా..నీకు హద్దులున్నవి
హద్దులన్ని సద్దులేని..ముద్దులతో చెరిగిపోతవి 
తందనా..తనానాన..తందనాన
తందనా..తనానాన..తందనాన              
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి

చరణం::2

ఎగిరెగిరిపడుతున్న..కోడెగిత్తలు
అది ఏనాడు మోయలి..మోపెడంతలు
ఎగిరెగిరిపడుతున్న..కోడెగిత్తలు
అది ఏనాడు మోయలి..మోపెడంతలు
ఎత్తుపల్లం చూస్తేనే..ఇన్నిగంతులు
మనది మెత్తనైన..దారైతే ఏల పంతాలు
ఎత్తుపల్లం చూస్తేనే..ఇన్నిగంతులు
మనది మెత్తనైన..దారైతే ఏల పంతాలు
పగాలు లేనినాడు..పంతాలు గెలవలేవూ
దసరిగరిసనిద దదద..సనిసరిసని దప పపప          
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి

చరణం::3

పచ్చని వరిచేను..పరువంలో ఉన్నది
పైరగాలి తగలగానే..పులకరించుచున్నది
పచ్చని వరిచేను..పరువంలో ఉన్నది
పైరగాలి తగలగానే..పులకరించుచున్నది
పులక పులకలో..వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని..కలలు గంటున్నది
పులక పులకలో..వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని..కలలు గంటున్నది
సంకురాత్రి పండుగకే సంబరాలు కాసుకున్నవి..హోయ్‌  
ఇరుసులేని బండి..ఈశ్వరుని బండి
చిరతలే లేనిది..చిన్నోడి బండి

No comments: