Showing posts with label జే గంటలు--1981. Show all posts
Showing posts with label జే గంటలు--1981. Show all posts

Wednesday, August 22, 2012

జే గంటాలు--1981

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7530#ytplayer

సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు , S.P.శైలజ 

పల్లవి::

ఇది ఆమని సాగే చైత్ర రథం చైత్ర రథం
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం పూల రథం 
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం..పూల రథం 
మనో వేగమున..మరోలోకమున
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం..పూల రథం
మనో వేగమున..మరోలోకమున
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 

చరణం::1

పంచ ప్రాణల వేనువుధీ కోయిల పాడాలి
ప్రణయాల పంచమ స్వరమాళపించాలి 
పంచ ప్రాణల వేనువుధీ కోయిల పాడాలి
ప్రణయాల పంచమ స్వరమాళపించాలి 
కృష్ణ వేనమ్మ యమునల్లే దారి చూపాలి 
నా క్రిష్నుడున్న తీరాలు చేరుకోవాలి
కృష్ణ వేనమ్మ యమునల్లే దారి చూపాలి
నా క్రిష్నుడున్న తీరాలు చేరుకోవాలి
నీరెండ పూలు పెట్టి నీలాల కోక చుట్టి 
నువ్వొస్తే బృందావనాలు నవ్వలి
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం పూల రథం
మనో వేగమున..మరోలోకమున 
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం

చరణం::2

అలనెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింకా తెరి చూడాలి 
అలనెలవంక పల్లకీలో సాగిపోవాలి
మనవంక తారలింకా తెరి చూడాలి
కోసమెరుపుల్ల ముత్యాల హరమేయ్యాలి 
నా వలపల్లే..నిను నేను అల్లుకోవాలి 
కోసమెరుపుల్ల ముత్యాల హరమేయ్యాలి 
నా వలపల్లే..నిను నేను అల్లుకోవాలి 
నా గుండే జల్లు మంటే గుడిగంటే 
గళ్ళు మంటే కౌగిళ్ళలో ఇల్లు కట్టుకోవాలి

ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం 
ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం పూల రథం
మనో వేగమున..మరోలోకమున 
పరుగులు తీసే..మనో రధం..మ్మ్ మ్మ్ మ్మ్
ఇది ఆమని సాగే చైత్ర రథం..చైత్ర రథం

Monday, October 11, 2010

జే గంటలు--1981



















సంగీతం::K.V. మహదేవన్
రచన::వేటూరి
గానం::ఏసుదాస్, వాణీ జయరాం 

పల్లవి:: 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా 
ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా 
కులుకులమ్మ కన్న కూతురా..మెరుపులమ్మ మేనకోడలా 
కులుకులమ్మ కన్న కూతురా..మెరుపులమ్మ మేనకోడలా 
ఎవరమ్మా..ఎవరమ్మా..ఈ కొమ్మా 

ఆ ఆ ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

చరణం::1 

కొనగోటను గోరింటలు పేరంటాలడగా 
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా 
ఊఁ..మూ..మూ..మూ..ఆహహా 
కొనగోటను గోరింటలు పేరంటాలడగా 
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా 

స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై 
స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై 
మురిసే ముద్దులగుమ్మా ఎవరమ్మా 
కులుకులమ్మ కన్న కూతురా..మెరుపులమ్మ మేనకోడలా 

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా... 

చరణం::2 

లలలలలలలలల..లలలలలలలలలా 
లలలలలలలలల..లలలలలలలలలా..ఆ..ఆ..ఆ 

కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా 
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా 
ఓ..ఓ..ఓ..ఓహో 
కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా 
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా

సందెగాలి తరగై చందమామ తునకై  
సందెగాలి తరగై చందమామ తునకై  
విరిసే పున్నమిరెమ్మ ఎవరమ్మా 

ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా 
ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా 
ఆ..ఆ..ఆ ఆ ఆ..ఆ అ ఆ..ఆ అ ఆ

జే గంటలు--1981




సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి:

ఊ..హ..ఓ..హా...
వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన..నా స్వామికీ వందనాలు

ఊ..వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన..నా దేవికీ వందనాలు

ఊ..వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు

చరణం::1

ఈ కన్నె కోపాలు..వెన్నెల్లో దీపాలు..
ఆ ముద్దు మురిపాలు..ఏ పోద్దు సగపాలు
ఈ కంటి నీలాలు..ఆ కంట పోంగితే
సురగంగ నీరాల..సరిగంగ తానాలు
ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ
ఈ ఒక్కరాతిరి తొలి రాతిరవ్వనీ 

కలలన్నీ కలయికలే..కలుసుకొనే కౌగిలిలో

వందనాలు..ఊ..వందానాలు వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి
వందనాలు వందనాలు..వలపుల హరిచందనాలు

సంపెంగ పూలలో..నా బెంగ దాచాను
సన్నజాజి నీడలో..ఈ నోము నోచాను
ఏకాంత సేవకే..ఇన్నాళ్ళు వేచాను
ఏకాంత వేళలో..నీ చెంత చేరాను

నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెలా
ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవేనా
మనసులనే మనువాడే..వలపులనే వయసులలో
వందనాలు..ఊ..వందనాలు వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన నా దేవికి వందనాలు
వందనాలు వలపుల హరిచందనాలు..ఊ..ఊమ్మ్..ఊం..ఊమ్మ్