సంగీతం::K.V. మహదేవన్
రచన::వేటూరి
గానం::ఏసుదాస్, వాణీ జయరాం
పల్లవి::
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా
ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా
కులుకులమ్మ కన్న కూతురా..మెరుపులమ్మ మేనకోడలా
కులుకులమ్మ కన్న కూతురా..మెరుపులమ్మ మేనకోడలా
ఎవరమ్మా..ఎవరమ్మా..ఈ కొమ్మా
ఆ ఆ ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చరణం::1
కొనగోటను గోరింటలు పేరంటాలడగా
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా
ఊఁ..మూ..మూ..మూ..ఆహహా
కొనగోటను గోరింటలు పేరంటాలడగా
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా
స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై
స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై
మురిసే ముద్దులగుమ్మా ఎవరమ్మా
కులుకులమ్మ కన్న కూతురా..మెరుపులమ్మ మేనకోడలా
ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా...
చరణం::2
లలలలలలలలల..లలలలలలలలలా
లలలలలలలలల..లలలలలలలలలా..ఆ..ఆ..ఆ
కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా
ఓ..ఓ..ఓ..ఓహో
కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా
సందెగాలి తరగై చందమామ తునకై
సందెగాలి తరగై చందమామ తునకై
విరిసే పున్నమిరెమ్మ ఎవరమ్మా
ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా
ఎవరమ్మా ఎవరమ్మా..ఈ కొమ్మా
ఆ..ఆ..ఆ ఆ ఆ..ఆ అ ఆ..ఆ అ ఆ
No comments:
Post a Comment