Monday, October 11, 2010

జే గంటలు--1981




సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి:

ఊ..హ..ఓ..హా...
వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన..నా స్వామికీ వందనాలు

ఊ..వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన..నా దేవికీ వందనాలు

ఊ..వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు

చరణం::1

ఈ కన్నె కోపాలు..వెన్నెల్లో దీపాలు..
ఆ ముద్దు మురిపాలు..ఏ పోద్దు సగపాలు
ఈ కంటి నీలాలు..ఆ కంట పోంగితే
సురగంగ నీరాల..సరిగంగ తానాలు
ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ
ఈ ఒక్కరాతిరి తొలి రాతిరవ్వనీ 

కలలన్నీ కలయికలే..కలుసుకొనే కౌగిలిలో

వందనాలు..ఊ..వందానాలు వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి
వందనాలు వందనాలు..వలపుల హరిచందనాలు

సంపెంగ పూలలో..నా బెంగ దాచాను
సన్నజాజి నీడలో..ఈ నోము నోచాను
ఏకాంత సేవకే..ఇన్నాళ్ళు వేచాను
ఏకాంత వేళలో..నీ చెంత చేరాను

నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెలా
ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవేనా
మనసులనే మనువాడే..వలపులనే వయసులలో
వందనాలు..ఊ..వందనాలు వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన నా దేవికి వందనాలు
వందనాలు వలపుల హరిచందనాలు..ఊ..ఊమ్మ్..ఊం..ఊమ్మ్

No comments: