సంగీతం::ఘంటసాల
రచన::నార్ల చిరంజీవి
గానం::ఘంటసాల, లీల
తారాగణం::N.T.రామారావు,అంజలీదేవి,గుమ్మడి,రాజనాల,రేలంగి, గిరిజ
పల్లవి::
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
జో జో..జో జో
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
చరణం::1
చెరసాలలో పుట్టి వ్రేపల్లెలో వెలసి
గొల్ల తల్లుల మనసు కొల్లగొనినాడు
ఏ తల్లి ఒడి జారి ఏలాగు చేరావొ
ఆపదలె కాపుదలలాయేనె నీకు
జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా
జో జో..జో జో
చరణం::2
పలు వేసములు పూని పగవారు హింసింప
పల్పోకడలు చూపె బాలగోపాలుడూ
ఈ ఈడుకే ఎన్ని గండాలు గడిచాయొ
ఎంత జాతకుడమ్మ అనిపించినావు
జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా
జో జో..జో జో
చరణం::3
కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి
కన్నవారికి చెరలు తొలగించినాడు
వసుదేవ తనయుని వారసత్వము నిలిపి
నీవారి వెతలెల్ల నీవె తీర్చేవు
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
జో జో..జో జో..జో జో..జో జో
జో జో..జో జో..జో జో..జో జో
No comments:
Post a Comment