సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::నాగార్జున,గౌతమి
పల్లవి::
పాప ఈడు గోలా పాట పేరు జోలా
ఊగుతోంది బాలా యవ్వనాల డోలా
నీవు వేణువైతే నేను ఊపిరౌతా
మోగాలీ ఎదలో ఈలా
మోహాలా సరిరాగాలా
be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time
చరణం::1
ఏదో సాగిందీ చిలిపి కథా
ఓటమి గెలుపైనా వలపు కథా
కునుకే రాకున్నా కనుల కథా
ఉడికే పరువాల పడుచు కథా
పూసేటి వేసంగి పూరేకులో
రాస్తాను నీ పేరు తేనెలతో
పెన్నేటి ఇసుకమ్మ తీరాలలో
వేస్తాను పాదాలు నీ జతలో
పాషాణమైపోకు వైఢూర్యమా
పాప ఈడు గోలా పాట పేరు జోలా
ఊగుతోంది బాలా యవ్వనాల డోలా
చరణం::2
పాటే కారాదు బ్రతుకు సుమా
అతికే మనసంటూ లేదు సుమా
చేతులు కలిపింది చెలిమి సుమా
ఎగిరే నా ప్రేమా పావురమా
ఆనాటి స్నేహాల వాకిళ్ళలో
ఈనాడు వేచేను దోసిలితో
కాలాలు దాటాను కౌగిళ్ళలో
స్వర్గాలు చూడాలి నీ ఒడిలో
శిల నీవు కాబోకు శృంగారమా
పాప ఈడు గోలా పాట పేరు జోలా
ఊగుతోంది బాలా యవ్వనాల డోలా
నీవు వేణువైతే నేను ఊపిరౌతా
మోగాలీ ఎదలో ఈలా
మోహాలా సరిరాగాలా
be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time
be happy happy all the time
No comments:
Post a Comment