సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::రాజేంద్రప్రసాద్,కిన్నెర.
పల్లవి::
జిగిజిగిజిగిజ జాగేల..వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..నాదేలే మమతల మణిహారం
ఓయ్..జిగిజిగిజిగిగిజ జాగేల..వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా
చరణం::1
లాలీ..లాలీ ప్రేమరాణీ..అనురాగంలోనే సాగిపోనీ
మేనలోన చేరుకోని..సురభోగాలన్నీ అందుకోనే
పెదవి పెదవి కలవాలి..ఎదలో మధువే కొసరాలి
బ్రతుకే మమతై నిలవాలి..మురళి స్వరమై పలకాలి
ప్రేయసి పలుకే మాణిక్య వీణ..ప్రేమావేశంలోన
కౌగిలి విలువే వజ్రాలహారం..మోహావేశంలోన
రావే రావే..రసమందారమా
జిగిజిగిజిగిజ జాగేల..వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..నాదేలే మమతల మణిహారం
చరణం::2
స్నానాలాడే మోహనాంగి..ఇక సొంతం కావే శొభనాంగి
దూరాలన్నీ తీరిపోనీ..రస తీరాలేవో చేరుకోని
తనువు తనువు కలిసాక..వగలే ఒలికే శశిరేఖ
ఎగసే కెరటం ఎదలోన..సరసం విరిసే సమయాన
ముందే నిలిచే ముత్యాల శాన..పువ్వై నవ్వే వేళ
రమ్మని పిలిచే రత్నాల మేడ..సంధ్యారాగం లోన
వలపే..పలికే..ఒక ఆలాపన
జిగిజిగిజిగిజ జాగేల..వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ..నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..నాదేలే మమతల మణిహారం
No comments:
Post a Comment