Friday, July 19, 2013

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,మాధవి,గొల్లపూడి మారుతిరావు,పూర్ణిమ,అన్నపూర్ణ,పి,యల్,నారాయణ.

పల్లవి::

హా..ఆ..ఆ..ఆ..ఆ..ఓ
అజంతా వెలవెలబోదా..ఎల్లోరా తల్లడిల్లదా
కాశ్మీరం కలవర పడదా..తాజ్మహల్ తడబడిపోదా
ఆ..ఆ..ఆ..హాయ్ హాయ్ హాయ్ హాయ్..ఆ..ఆ..ఆ
ఒక వనిత..నవ ముదిత..సుమ లలిత..రస భరిత
ఒక వనిత..నవ ముదిత..సుమ లలిత..రస భరిత
అలిగితే ఏమవుతుంది..అందం నాగు పామౌతుంది
గోరింకా..ఆఆ..హహహ..ఓ గోరింకా..ఆ..హేయ్
గోరింకా..హా..ఓ గోరింకా..హా..హా..హా..హా

చరణం::1

ఆ..కొసవేళ్ళ సవరణ నోచుకున్నా..కురులదేమి భాగ్యమో
ఆ..అడుగుల నునుపు ముద్దాడుకున్నా 
గడపదెంత సౌభాగ్యమో..ఆ..ఆ..ఆ..ఆ
అది కంటి మెరుపో..ఆ బ్రహ్మ గెలుపో
అది కంటి మెరుపో..ఆ బ్రహ్మ గెలుపో
కాకా..కాకా..కాకా
లల్లలా..లల్లలా..లల్లలా..లరలా..ఆ

అలిగితే ఏమౌతుంది ఉదయమే నడిజామౌతుంది
గోరింకా..ఓ గోరింకా..హోయ్..ఊఁహహ
గోరింకా..హా..ఓ గోరింకా..హా..హా..హా..హా

చరణం::2

ఆ..అలివేణి మోమును చూసిన..అద్దానిదెంతటి పుణ్యమో
ఆ..చెలి నుదుటను ముద్దుగ దిద్దిన
తిలకానిదెంతటి లావణ్యమో..ఆ..ఆ
ఆ..రంభ రూపం..అపరంజి శిల్పం..హ హ
ఆ.రంభ రూపం..అపరంజి శిల్పం..హ హ
ఆ..చంద్ర వదన..ఆ కుందరదన
ఆ..కమల నయన..ఆ కాంతి సదన
నవ్వితే ఏమౌతుంది..నవ్వే నవ్వుకు నవ్వౌతుంది

గోరింకా..హే గోరింకా..హ..హ..హ
గోరింకా..హా చాలింకా..హ..హ..హ

No comments: