Friday, July 19, 2013

సప్తపది--1981



సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::K.V.సోమయాజులు,సవిత,గిరీష్,అల్లు రామలింగయ్య,రమణమూర్తి,సాక్షి రంగారావు 

పల్లవి:

గోవుల్లు తెల్లన..గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా..ఎందువలనా
గోవుల్లు తెల్లన..గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా..ఎందువలనా
గోధూళి ఎర్రనా ఎందువలనా 

చరణం::1

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా..ఏమో

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా..ఈ పొద్దు గడిచేనా
ఎందువలనా అంటే అందువలనా
ఎందువలనా అంటే దైవఘటనా

గోవుల్లు తెల్లన..గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా..ఎందువలనా
హొయ్ ఒయ్ గోధూళి ఎర్రనా ఎందువలనా  

చరణం::2 

పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ..పాపం
అల్లన మోవికీ తాకితే గేయాలూ..హా హా హా
పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ
అల్లన మోవికీ తాకితే గేయాలూ

ఆ మురళి మూగైనా..ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో..ఈ పాట నిండదా
ఈ కడిమీ పూసేనా..ఆ కలిమీ చూసేనా

ఎందువలనా అంటే అందువలనా
ఎందువలనా అంటే దైవఘటనా
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా
గోధూళి ఎల్లనా ఎందువలనా
గోధూళి ఎర్రనా ఎందువలనా
లలాల లాలలా లల్లల

No comments: